రన్నింగ్ ట్రైన్ లో ఖాళీగా ఉన్న సీట్లను ఇలా గుర్తించండి
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల కోసం ఒక సౌలభ్యాన్ని కల్పించబోతోంది. ఏ బోగీలో ఎన్ని సీట్లు రన్నింగ్ ట్రైన్ లో ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులు కన్ఫర్మ్ టికెట్లు పొందడం సులువవుతుంది. ప్రయాణికుల మొబైల్ కు రైలులో ఖాళీగా ఉన్న సీట్ల జాబితాను పంపిస్తుంది.
3 నెలల్లో అందుబాటులోకి
రాబోయే మూడు నెలల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేబోతున్నారు. ఈలోగా సరికొత్త ఫీచర్లను యాడ్ చేయాలని చూస్తున్నారు. IRCTC వెబ్‌సైట్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులు కొత్త విధానంలో గేట్ రైలు చార్ట్ ను ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు. తర్వాత IRCTC నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేయడంద్వారా ఖాళీ సీట్ల గురించి తెలుసుకోవచ్చు.

మెసేజ్ వచ్చిన తర్వాత ప్యాసింజర్ లింక్ ను ఓపెన్ చేయాలి. ఏ రైలులో ప్రయాణిస్తున్నారు? ఎన్నిసీట్లు ఏయే తరగతుల్లో ఖాళీగా ఉన్నాయి? లాంటి వివరాలను తెలుసుకోవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం వీటిని మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన పంపిణీ చేయబోతున్నారు. సీటు కేటాయించినందుకు రుసుము రూ.5 లేదంటే రూ.10 ఉండొచ్చని, లేదంటే ఉచితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఖాళీగా ఉన్న సీట్లను ఎలా గుర్తించాలంటే?
IRCTC వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఖాళీగా ఉన్న సీటు గురించిన సమాచారాన్ని గేట్ రైలు చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రయాణికుల మొబైల్‌లో ఖాళీ సీట్ల వివరాలను పంపే సదుపాయం లేదు. అయితే త్వరలోనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తేనున్నారు. ప్రయాణికుల వివరాలను పూరించిన తర్వాత గేట్ చార్ట్ పై క్లిక్ చేయాలి. SMS లేదా WhatsApp ద్వారా గెట్ అలర్ట్ ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ సీటు కన్ఫర్మ్ కాకపోతే ఆ సమాచారం కూడా ఇస్తారు.












Click it and Unblock the Notifications