అగ్ని ప్రమాదం: విశాఖ నేవీ క్యాంటీన్‌లో భారీ ఆస్తినష్టం
విశాఖపట్నం: జిల్లాలోని తూర్పు నావికాళం ప్రధాన క్యాంటీన్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అందులోని సిబ్బంది బయటికి వచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఏడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి. మంటలు ఆరిపోయినప్పటికీ పెద్ద ఎత్తున దట్టమైన పొగు బయటికి వస్తోంది.
అగ్నిప్రమాదం ఘటనలో నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు భారీ ఎత్తున దగ్ధమయ్యాయి. ఆస్తి నష్టం కోటి రూపాయలకుపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్యాంటీన్ ఆనుకొని ఉండటంతో ఎస్‌బిఐ భవన్ ఉండటంతో అందులోని సిబ్బంది, ఉద్యోగులు కూడా బయటికి వచ్చారు. అనుకుని వున్న ఎస్ బిఐ
మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి
తూర్పుగోదావరి: జిల్లాలోని మలికిపురం మండలం చింతలమోరిలో విషాదం చోటు చేసుకుంది. శనివారం సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు.
విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతున్న మినీ వ్యాన్, ఆగి వున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వ్యానులో ప్రయాణిస్తున్న పది మందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications