ఆర్టీసి గరుడ బస్సులో మంటలు, తప్పిన ప్రమాదం

బస్సు మంగళవారం అర్ధరాత్రి నసర్లపల్లి సమీపానికి రాగానే లగేజీ బాక్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. కాలిన వాసన వస్తుండటంతో వెనుక సీట్లలో ఉన్న ప్రయాణీకులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. డ్రైవర్ బస్సును పక్కకి ఆపాడు. వెంటనే ప్రయాణీకులు కిందకు దిగారు.
పరిశీలించిన డ్రైవర్ లగేజీ బాక్సులో మంటలు అంటున్నట్లుగా గుర్తించి అందుబాటులో ఉన్న నీటితో వాటిని అదుపు చేశారు. ఇంకా పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
అనంతపురం జిల్లా కణేకల్ శివారులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న బైకు ఓ కల్వర్టును ఢీకొట్టింది.












Click it and Unblock the Notifications