Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేణుగోపాలస్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు, భక్తుల పరుగులు

పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు మండలం దువ్వలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో రాములవారి కళ్యాణోత్సవం నిర్వహించారు. అయితే, షాట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన చలువ పందిరిలో మంటలు చెలరేగాయి.

పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో భయాందోళనలకు గురైన భక్తులు ఆలయం బయటికి పరుగులు తీశారు. దీంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. భక్తులతో కలిసి స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Fire breaks out at a temple in Duvva village in West Godavari during Rama Navami celebrations

ఇది ఇలావుండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లోనూ అపశృతి చోటు చేసుకుంది. ఇండోర్‌లోని ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలడంతో అందులో 30 మంది వరకు భక్తులు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు బావిలో పడివారిని బయటికి తీశారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇండోర్ పటేల్‌నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యాయి. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైకప్పుపై కూర్చున్నారు. అయితే, కొంతసేపటి తర్వాత ఆ బావి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దాదాపు 25 మందికిపైగా భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నిచ్చెన సాయంతో భక్తులను బయటకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మందిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు తెలుస్తోంది. బావిలో పడిన మిగితా భక్తులను కూడా బయటికి తీసేందుకు పోలీసులు, అధికారులు శ్రమిస్తున్నారు. కొందరికి తీవ్రగాయాలైనట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+