Yatra 2: కష్టం వస్తే భయపడి వెనుతిరిగి చూడటం నేర్పించలేదు..
YS Bharathi: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న మూవీ.. యాత్ర 2 (Yatra 2). మహీ వీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీ అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది.
వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి జీవించారు. రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో అనసూయ.. కీలక పాత్రల్లో నటించారు. 2019 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర విడుదలైన ఈ సినిమా అప్పట్లో పొలిటికల్ సెన్సేషన్‌గా మారింది.

ఇప్పుడా సినిమాకు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉందా మూవీ. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తోన్నారు. ఇందులో కూడా వైఎస్సార్ క్యారెక్టర్ ఉంది. మమ్ముట్టే ఆ పాత్రను పోషిస్తోన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది ఈ మూవీ.
2024 ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ విడుదలయ్యాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. యాత్ర తరహాలోనే ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ సినిమాలో కీలకమైన పాత్ర వైఎస్ భారతిది. ఈ పాత్రను ఇంట్రడ్యూస్ చేయనున్నారు దర్శకుడు మహీ వీ రాఘవ్. వైఎస్ భారతి పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు.. అనే క్యాప్షన్ జోడించారు.
మలయాళ నటి చెందిన కేతకి నారాయణ్ (Ketaki Narayan) ఈ సినిమాలో వైఎస్ భారతి పాత్రను పోషించారు. మలయాళం, హిందీ, మరాఠీ సినిమాల్లో నటించారు. 83, అవియాల్, విచిత్రం, సమైరా.. ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చాయి.












Click it and Unblock the Notifications