అసెంబ్లీలో 116సార్లు లేచిన జానా, 4 వరుసలే నిండాయి

ఇంకొందరు ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. కొందరు సభలోని మిగతా సభ్యులకు నమస్కరిస్తూ, వారితో కరచాలనం చేశారు. తొలుత ముఖ్యమంత్రి కెసిఆర్, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. గవర్నర్ వద్ద ప్రమాణం చేసిన ప్రొటెం స్పీకర్ జానాను కలుపుకొని మొత్తం 117 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ, ముంతాజ్‌లు సభకు హాజరు కాలేదు.
ఆయా పార్టీల సభ్యులు వారి వారి పార్టీల జెండాలతో వచ్చారు. సభ్యులకు ఇంకా స్థానాలు కేటాయించలేదు. అయితే సంప్రదాయం ప్రకారం స్పీకర్‌కు కుడివైపు అధికార తెరాస సభ్యులు, ఎడమవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు కూర్చున్నారు. ఇరుపార్టీల సభ్యులకు మధ్య బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీలు కూర్చున్నాయి.
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన విశాలమైన శాసన సభ హాలులోనే తెలంగాణ సభ కొలువుదీరింది. సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో మొత్తం ఎనిమిది వరుసలలో ఉన్న సీట్లలో మొదటి నాలుగు వరుసలు మాత్రమే నిండాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 మంది సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. ఆ మేరకు స్థానాలు ఖాళీగా కనిపించాయి.












Click it and Unblock the Notifications