Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మత్స్యకారుల వలకు చిక్కిన అదృష్టం; అరుదైన కచ్చిడి చేపలతో కాకినాడ మత్స్యకారులకు లక్షల ఆదాయం!!

మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. వేటకు వెళ్లిన సమయంలో మత్స్యకారుల వలలో ఎక్కువ చేపలు పడ్డాయి అంటే ఆ రోజు వారి సంతోషానికి అవధులు ఉండవు. ఎక్కువ చేపలు వలలో చిక్కిన రోజున మత్స్యకారుల ఇళ్లల్లో పండుగే పండుగ.. అయితే సముద్రంలో వేట సాగించేవారికి చాలావరకు అరకొర ఆదాయమే లభిస్తుంది. అప్పుడప్పుడు అదృష్ట లక్ష్మి వారికి చేపల రూపంలో తారసపడుతుంది.

మత్స్యకారుల వలకు చిక్కిన కచ్చిడి చేపలు

ఇక అటువంటి సంఘటనే తాజాగా కాకినాడ తీరంలో చోటు చేసుకుంది. కాకినాడ సాగర తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన కచ్చిడి చేపలు చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సాధారణ చేపల కోసం వేసిన వలలో లక్షల రూపాయలను కురిపించే కచ్చిడి చేపలు చిక్కడంతో ఆ మత్స్యకారుల పంట పండింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది చేపలు వలకు చిక్కడంతో మత్స్యకారుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

అద్భుతమైన ఔషధ గుణాలున్న అరుదైన చేపలు కచ్చిడి చేపలు

అద్భుతమైన ఔషధ గుణాలున్న అరుదైన చేపలు కచ్చిడి చేపలు

అసలు ఇంతకీ ఈ కచ్చిడి చేపలు ఏంటి? వీటి ధర లక్షల్లో ఎందుకు పలుకుతుంది అంటే.. కచ్చిడి చేపలను బంగారు చేపలు అని కూడా అంటారు. గోల్డెన్ ఫిష్ గా పిలవబడే ఈ కచ్చిడి చేపల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని చెబుతారు. ఈ చేపల పొట్ట భాగాన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారని తెలుస్తుంది. కచ్చిడి చేప పొట్టలోని గాల్ బ్లాడర్ ను బలానికి వాడే మందుల తయారీలో వినియోగిస్తారు. సర్జికల్ సమయాలలో కుట్లు వేసే దారాన్ని తయారు చేయడంలో కూడా దీని గాల్ బ్లాడర్ ను వాడతారు.

కచ్చిడి చేపలకు విపరీతమైన డిమాండ్

కచ్చిడి చేపలకు విపరీతమైన డిమాండ్

ఖరీదైన వైన్ తయారీలో కూడా, ఈ చేప శరీర భాగాలను ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఈ చేపలలో ఆడ చేప కన్నా మగ చేప కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని సమాచారం. అందుకే ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పెద్ద కచ్చిడి చేపలు అయితే ఒక్కో చేపను లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు. తాజాగా కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన ఎనిమిది కచ్చిడి చేపలు కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీపడ్డారు.

ఒక్కో చేప 50 వేలు.. మత్స్యకారుల పంట పండింది

ఒక్కో చేప 50 వేలు.. మత్స్యకారుల పంట పండింది

కాకినాడ తీరంలో వలలో పడినవి కాస్త చిన్న చేపలు కావడంతో ఒక్కో చేప 50 వేల రూపాయల ధర పలికింది. మొత్తం 8 చేపలు నాలుగు లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక ఈ చేపలను వేలంలో పెట్టి అమ్మకాలు జరుపుతారు. వీటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీపడతారు. చాలాకాలం విరామం తరువాత చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు, వేటకు వెళ్ళిన నాలుగో రోజే ఈ కచ్చిడి చేపలు అదృష్టం కొద్దీ వలలో పడడం మత్స్యకారులను సంతోషంతో ముంచేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+