బెజవాడలో విషాదం: షాక్ కొట్టి ఒకే ఫ్యామిలీకి చెందిన 5గురు మృతి
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ భవానీపురంలోని ఊర్మిళనగర్‌లో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో విద్యుదాఘాతం సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
రేకుల షెడ్డు నిర్మిస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఊర్మిళా నగర్‌లో ఓ భవనం నిర్మాణంలో ఉంది. ఈ పనుల్లో పాల్గొనేందుకు ఏడుగురు కార్మికులు ఉదయం భవనం వద్దకు చేరుకున్నారు. రేకుల షెడ్ నిర్మిస్తున్నారు. వారిలో ఒకరికి హైటెన్షన్ వైరి తగిలింది. అతడిని రక్షించేందుకు మిగతా ఆరుగురు ప్రయత్నించారు. దీంతో అక్కడికి అక్కడే ఐదుగురు మృతి చెందారు.












Click it and Unblock the Notifications