AP: ఏపీ నుంచి మంత్రి పదవులు దక్కేది వీరికే.. !
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రధానితో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఏపీ టీడీపీ నుంచి ముగ్గురికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జనసేన నుంచి ఒకరు, ఏపీ బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. తెలంగాణకు కూడా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ కు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటికే ఎంపీలకు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. రేపు ఉదయాని కల్లా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయో తెలియనుంది. ఈసారి కేంద్రంలో జంబో క్యాబినెట్ ఉండే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత ఢిల్లీలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications