వందే భారత్ కంటే విమానం టికెట్లే చీప్?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో కాచిగూడ-యశ్వంత్ పూర్ వందేభారత్ కూడా ఒకటి. ఇందులో ఛార్జీలు చూస్తే.. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య చైర్ కార్ టికెట్‌కు రూ.1600, ఎగ్జిక్యూటీవ్ చైర్ క్లాస్‌కు రూ.2915గా నిర్ణయించారు. కేటరింగ్ ఛార్జీలు కూడా కలిపారు. ఎగ్జిక్యూటివ్ చైర్ క్లాస్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.419కాగా, చైర్ కార్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.364గా ఉన్నాయి.
ఈజీగా దొరుకుతున్నాయి
యశ్వంత్‌పూర్ జంక్షన్ నుంచి కాచిగూడ మధ్య ఛార్జీలు ఏసీ చైర్ కార్‌కు రూ.1540, ఎగ్జిక్యూటీవ్ చైర్ కార్‌కు రూ.2865 గా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ చైర్ క్లాస్‌లో కేటరింగ్ ఛార్జీలు రూ.369, చైర్ కార్‌లో ఛార్జీలు రూ.308గా ఉన్నాయి. బుకింగ్ స్టేటస్ చూస్తే సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకరోజు గ్యాప్ తో ప్రయాణం చేయాలనుకునేవారికి సులువుగా టికెట్లు దొరుకుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ చైర్ క్లాస్ టికెట్లకు వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది.

రూ.3వేలలో అయిపోతుంది
ఈ ఛార్జీలకన్నా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానం టికెట్ తక్కువ కావడం విశేషం. ముందుగా ప్లాన్ చేసుకునేవారైతే రైలుకన్నా విమానంలో వెళ్లడమే మంచిది. ఎందుకంటే తొందరగా వెళ్లడంతోపాటు ఖర్చు తక్కువవుతుంది. బోలెడంత ప్రయాణ సమయం ఆదా అవుతుంది. వందే భారత్ రైలుతో పోలిస్తే విమానంద్వారా 4 నుంచి 5 గంటల సమయం ఆదా అవుతుంది. ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌లో వెళ్లాలనుకునేవారికి మాత్రమే విమానం బెటరని చెప్పొచ్చు. ముందుగా విమానం టికెట్లు బుక్ చేసుకునేవారైతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, అలాగే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రూ.3వేలే అవుతుంది. వందే భారత్ లో దీనికన్నా ఎక్కువగా ఛార్జీలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications