Vijayawada-Mumbai Flight: విజయవాడ ప్రజలకు శుభవార్త.. ప్రారంభమైన ముంబై విమానం..

విజయవాడ నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. విజయవాడ నుంచి ముంబైకి విమాన సర్వీస్ మొదలుపెట్టినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. మొదటి విమానం శనివారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ముంబై నుంచి విజయవాడకు చేరుకుంది. తిరిగి రాత్రి 7 గంటల 10 నిమిషాలకు విజయవాడ నుంచి ముంబైకి బయల్దేరింది. విజయవాడ నుంచి ముంబైకి విమానం ప్రారంభం కావడానికి జనసేన ఎంపి బాలశౌరి చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాలశౌరి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఛైర్మెన్ గా పని చేశారు. ఆ సమయంలో విజయవాడ, ముంబై మధ్య డైలీ విమాన సర్వీస్ ప్రారంభించాలని సంబంధిత శాఖ మంత్రులు, అధికారులను కోరారు. అయితే తాజాగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం.. కేంద్రంలో కీలకంగా ఉండడం, పైగా.. ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడికి విమానయాన శాఖ మంత్రిగా ఉండడంతో విజయవాడ-ముంబై మధ్య ఎయిర్ ఇండియా డైలీ సర్వీస్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Flight services have started from Vijayawada to Mumbai

ఎంపీ బాలశౌరి ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో ఈ విమాన సర్వీసును ప్రారంభం అయ్యిందని, ఎంపీ కార్యాలయం ప్రెస్ నోట్‌ విడుదల చేసింది. ఈ సర్వీస్ వల్ల విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ముంబై వెళ్లడం సులువైంది. శనివారం గన్నవరం విమానాశ్రయంలో కొత్త విమాన సర్వీసును ఎంపీ బాలశౌరి ప్రారంభించారు.

ఈ విమానాన్ని ప్రతిరోజూ నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ విమానంలో 180 మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. కొత్త విమాన సర్వీసుల కారణంగా వ్యాపారస్తులకు ప్రయాణం సులభం కానుందని స్థానిక నాయకులు చెబుతున్నారు. వాణిజ్య కేంద్రమైన ముంబై నగరానికి ఏపీ నుంచి వ్యాపారులు నిత్యం ప్రయాణిస్తుంటారని.. ఈ విమానం నడపడం మంచిదన్నారు.

గతంలో విమాన ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్‌లపై ఆధారపడాల్సి వచ్చేదని పేర్కొంటున్నారు. విజయవాడ నుంచి ముంబైకి విమానం నడవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బాలశౌరికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+