చంద్రబాబు టీంలోకి జగన్ సన్నిహిత నేత..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. వైసీపీ ముఖ్య నేతలను కూటమిలో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా జగన్ తొలి కేబినెట్ లో కీలక శాఖలు నిర్వహించిన సీనియర్ నేత ఇప్పుడు టీడీపీలో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఈ నేత తిరిగి ఇప్పుడు టీడీపీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.

వైసీపీలో మంత్రిగా
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూటమి పార్టీల్లోకి చేరారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఉన్నారు. కాగా, కొద్ది కాలంగా వైసీపీ నుంచి నేతల వలసలు ఆగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుం టోంది. ఈ సమయంలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెడుతోంది. ముఖ్యంగా ఉత్తరాం ధ్ర జిల్లాల్లో వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా గతంలో టీడీపీలో ఎంపీగా పని చేసిన నేత 2024 ఎన్నికల వేళ వైసీపీలో చేరారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. ఎన్నికల్లో ఓటమి తరువాత అవంతి మౌనం పాటిస్తున్నారు.

fomer-minister-form-ysrcp-all-set-to-join-in-tdp-details-here

మూడు పార్టీల్లో
తొలుత 2009 లో ప్రజారాజ్యం నుంచి అవంతి ఎమ్మెల్యే గా గెలుపొందారు. మాజీ మంత్రి గంటా తో సన్నిహిత సంబంధాలు నడిపిన అవంతి.. ఇద్దరూ 2014 లో కలిసి టీడీపీలో చేరారు. అప్పుడు గంటా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఇష్టం లేకపోయినా అవంతి ఎంపీగా వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత కాలంలో గంటా తో విభేదించి వైసీపీలో చేరారు. 2019 లో వైసీపీ నుంచి తిరిగి విజయం సాధించి మంత్రిగా రెండున్నారేళ్లు పని చేసారు. మంత్రివర్గ విస్తరణలో అవంతకి పదవి దక్క లేదు. అప్పటి నుంచి అవంతి కొంత అయిష్టంగానే పార్టీలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో గంటా ప్రత్యర్ధిగా కాగా.. ఆ ఎన్నికల్లో అవంతి ఓడిపోయారు. ఆ తరువాత అప్పుడప్పుడు కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసారు.

టీడీపీలోకి ఎంట్రీ
విశాఖ గ్రేటర్ కార్పోరేషన్ లో కూటమి పాగా వేయటానికి అవంతి సహకరించారనే వాదన ఉంది. అవంతి కుమార్తె కూటమికి అనుకూలంగా ఓటు వేయటంతో వైసీపీ నుంచి కార్పోరేషన్ కూటమికి వెళ్లిపోయింది. ఇక, ఏడాది కాలంగా గంటా టీడీపీ లేదా జనసేనలో చేరాలని ప్రయత్నాలు కొనసా గిస్తున్నారు. అయితే.. గంటా అందుకు అంగీకరించలదనే ప్రచారం ఉంది. చిరంజీవితో అవంతికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పవన్ పైన చేసిన వ్యాఖ్యల కారణంగా.. జనసేనలోకి ఎంట్రీ దక్క లేదని చెబుతున్నారు. ఇక, టీడీపీలో మాజీ మిత్రుల ద్వారా మంత్రాంగం చేసిన అవంతికి టీడీపీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. త్వరలోనే అవంతి అధికారికంగా టీడీపీ లో చేరుతారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+