తిరుమల చరిత్రలో తొలిసారి, చిరుత దాడిలోనే - చిన్నారి మృతిపై నివేదిక..!!
Tirumala: తిరుమల కాలి నడక మార్గంలో చిన్నారిని చంపింది చిరుతేనని నిర్ధారణ అయింది. చిరుత దాడి చేసినట్లో పోస్టు మార్టం నివేదిక..ఫోరెన్సిక్ నివేదికలు నిర్దారించాయి. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చెందిన లక్షిత మృత దేహానికి రూయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అందులో తొలుత చిన్నారి శరీరం పైన గాయాలు చూసి ఎలుగుబంటి దాడి చేసినట్లుగా భావించారు. కానీ, అధ్యయనంలో చిరుత దాడిగా నిర్దారణకు వచ్చారు.
ఆరేళ్ల బాలిక బాలిక మృతి : తిరుమలలో కాలి నడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల కొండ పైకి వెళ్తున్న సమయంలో బాలిక అదృశ్యం అయింది. దీంతో, అధికారులకు సమాచారం ఇవ్వటంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఉదయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వద్ద బాలిక మృత దేహం గుర్తించారు. దీంతో, తిరుమల పరిసరాల్లో విషాదం నెలకొంది.

ముగ్గురు చిన్నారులతో వెళ్తున్న కుటుంబ సభ్యుల్లో అరేళ్ల వయసున్నలక్షిత శుక్రవారం రాత్రి నడకమార్గంలో అదృశ్యం అయింది. దీంతో, అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో చిరుత ఒక చిన్నారి పైన దాడి చేసిన ప్రాంతం కావటంతో పోలీసులతో పాటుగా అటవీ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.
చిరుత దాడితో లోతైన గాయాలు : అయితే, ఊహించని విధంగా ఈ ఉదయం బాలిక మృత దేహాన్ని అధికారులు గుర్తించారు. అలిపిరి మెట్ల మార్గంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో మృత దేహాన్ని చూసిన స్థానికులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి బాలిక అదృశ్యం అయిన ప్రాంతం..గతంలో అయిదేళ్ల చిన్నారి పైన చిరుత దాడి చేసిన ప్రాంతానికి సీమీపంలోనే ఉంది. జూన్ 22న ఇదే ప్రాంతంలో ఒక చిన్నారి పైన చిరుత దాడి చేసింది.
తిరుమల: అలిపిరి నడకమార్గంలో ఆరేళ్ల లక్షిత పై చిరుత దాడి. మృతి చెందిన చిన్నారి..!!#Tirumala #Cheetah #TTD #Alipiri #TirumalaNews #Leopard #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/Ex2wUwtuX2
— oneindiatelugu (@oneindiatelugu) August 12, 2023
ఆ సమయంలో భక్తులు కేకలు వేయటంతో చిరుత చిన్నారిని వదిలేసి వెళ్లింది. ఆ బాలుడుకి టీటీడీ స్విమ్స్ లో చికిత్స చేయించింది. బాలుడు తరువాత కోలుకున్నాడు. ఆ సమయం నుంచి భక్తులు నడక మార్గంలో రాత్రి సమయంలో గుంపులుగా గోవింద నామ స్మరణతో వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. ఇప్పుడు చిరుత ఏకంగా బాలికను బలి తీసుకుంది.

తిరుమలలో తొలి సారిగా : బాలికకు పోస్టు మార్టంతో ముఖం..శరీర భాగాలపై చిరుత తీవ్ర గాయాలు..పాప జుట్టును పెరికిన ఆనవాళ్లు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన చేసారు. చిరుత దాడి చేసినట్లుగా నిర్దారణకు వచ్చారు. బాలికకు సంబంధించిన ఆనవాళ్లు సేకరించారు. గతంలో ఒకసారి చిరుత దాడి జరిగినా..అధికారులు సరైన స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
బాలిక మృత దేహాన్ని నెల్లూరు తరలించారు. ఈ ఘటన పైన ప్రభుత్వం ఆరా తీసింది. తిరుమల దర్శనానికి వచ్చి చిరుత దాడిలో గాయపడి మరణించటం తిరుమల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఘటన పైన కాసేపట్లో టీటీడీ ఛైర్మన్, ఈవో అధికారికంగా స్పందించనున్నారు.












Click it and Unblock the Notifications