తేల్చి చెప్పిన కేతిరెడ్డి- ఇకపై.. !!
ములకలచెరువు అక్రమ మద్యం కేసులో బెయిల్ పై విడుదల అయిన వైఎస్ఆర్ కాంగ్రెస సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను పార్టీకి చెందిన ధర్మవరం మాజీ శాసన సభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. ఆయన జిల్లాకు చెందిన పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. జోగి రమేష్ తో కలిసి చాలాసేపు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జోగి రమేష్‌పై నమోదు చేసినవి తప్పుడు కేసులేనని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన్ను జైలుకు పంపారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు కేసులకు భయపడే రోజులు పోయాయని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగంతో ఎంతమంది మీద ఎంతమంది కేసులు పెట్టినా, అంత ఉత్సాహంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. ఎటువంటి కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో అవి నిలవబోవని కేతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అక్రమ కేసులతో ప్రతిపక్షాన్ని అణచివేయాలన్న ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై గతంలో నమోదైన కేసులను ఎందుకు తొలగిస్తున్నారని కేతిరెడ్డి ప్రశ్నించారు. కేసులు తొలగించడం ద్వారా సాక్షులను ప్రభావితం చేసినట్టవుతుందని ప్రశ్నించారు. ఒకవైపు ప్రతిపక్ష నేతలపై వరుస కేసులు, మరోవైపు అధికార పార్టీ నేతలపై కేసులు ఎత్తివేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వారిపై కూడా కేతిరెడ్డి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. నిరాధార ఆరోపణలతో వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో పార్టీ గానీ, పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు గానీ వెనకడుగు వేయబోరని, అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు భయపడకుండా ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని కేతిరెడ్డి స్పష్టం చేశారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!











Click it and Unblock the Notifications