రుషికొండ ప్యాలెస్ ను ఇలా వాడుకోండి-బాబుకు సీబీఐ మాజీ డైరెక్టర్ సలహా..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కోసం అప్పటి ప్రభుత్వం విశాఖలో నిర్మించిన విలాసవంతమైన రుషికొండ ప్యాలెస్ పై ఇప్పుడు జాతీయ స్దాయిలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే జాతీయ మీడియాలో సైతం దీనిపై కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో రుషికొండ ప్యాలెస్ ను ఏపీలో కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో పలువురు ప్రముఖులు దీనిపై సీఎం చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారు.
విశాఖ రుషికొండ ప్యాలెస్ ను ఏం చేయాలన్న దానిపై చర్చ సాగుతున్న నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సీఎం దీనిపై ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. అందులో ఆయన.. జగన్ ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి మొదలైన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరారు. ఆ తర్వాత దీన్ని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చడం ద్వారా ఏపీ ప్రజలకు అంకితం చేయాలని సీఎంకు సూచించారు.

Pending any investigation into allegations of illegalities, misuse of public funds and corruption, etc in construction of #Rushikonda_Palace in Visakhapatnam by Jagan Government, Sri @ncbn garu is requested to consider dedicating it to the people of AP by converting it into a… pic.twitter.com/1mL5XuieNw
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) June 18, 2024
ఢిల్లీ ఎయిమ్స్ లేదా జిప్ మర్ తరహాలో దీన్ని మార్చి ప్రజలకు అంకితం చేయాలన్నారు. తద్వారా ఆంద్రప్రదేశ్‌ను తన వ్యక్తిగత ద్వేషంగా మార్చుకున్న జగన్‌కు తగిన సమాధానం చెప్పాలని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కోరారు.గొప్ప వైద్య శాస్త్రవేత్తలలో ఒకరైన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరున ఈ ఆస్పత్రికి పెట్టాలని కూడా చంద్రబాబును కోరారు. ఔషధ ఆవిష్కరణ, వైద్య శాస్త్రాల పురోగతిలో ఆయన సహకారం అసాధారణమైనది, కానీ అది గుర్తింపు పొందలేదని తన ట్వీట్ లో తెలిపారు. అర్దం లేని పొడవైన పేర్లు పెట్టకుండా ప్రకాశం పంతులు పేరును ప్రకాశం జిల్లాగా పెట్టినట్లు దీన్ని సుబ్బా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లా పెట్టుకోవచ్చన్నారు.












Click it and Unblock the Notifications