వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతల పనితీరు - అవినీతిపై మాజీ జేడీ సర్వే రిపోర్టు విడుదల..!!

|
Google Oneindia TeluguNews

ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖల్లో అవినీతి అంశాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. అవినీతిని నిరోధించకపోతే అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అధికారుల అవినీతి, నాయకుల పనితీరుపై నిర్వహించిన సర్వే వివరాలను లక్ష్మీనారాయణ విడుదల చేసారు. 64 శాతం మంది ప్రజలు తమ ఎమ్మెల్యేల పని తీరుపై సంతృప్తి లేనట్లు నివేదక స్పష్టం చేస్తోంది.

ఈ సర్వేలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికంగా ఉందంటూ 54.6 శాతం మంది ప్రజలు వెల్లడించారు. ప్రధానంగా ప్రభుత్వ శాఖలైన రెవెన్యూ, పోలీసు, మునిసిపల్‌, ఆస్పత్రులు, కాలుష్య నియంత్రణ బోర్డు, రిజిస్రేషన్‌, విద్యుత్‌, విద్య శాఖలతో పాటు రాజకీయ నాయకులు, గ్రామ పంచాయతీల్లో అవినీతి అధికంగా ఉందని సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు. లంచం ఇవ్వకపోతే పనులు అవ్వటం లేదని 39.7 శాతం మంది చెబితే, లంచం ఇవ్వని కారణంగా ఇబ్బంది పెడుతున్నారంటూ 32.4 శాతం మంత్రి ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల పని తీరు అధ్వాన్నంగా ఉందని 45 శాతం మంది చెప్పగా.. 36.3 శాతం మంతి అసలు బాగోలేదని వెల్లడించారు.

Former CBI JD Laxmi Naryana released Survey Report on corruption in government offices

మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకుంటున్నారని 40.6 శాతం మంది చెప్పుకొచ్చారు. మొత్తంగా ప్రభుత్వ శాఖల్లో 93 శాతం అవిని ఉందని అభిప్రాయపడగా, అధికంగా ఉందని అందులో 55 శాతం మంది వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే హెల్ప్ డెస్క్ ల్లో ఆ ఆఫీసుకు సంబంధం లేని వారు ఇద్దరు అక్కడ ఉండాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో 45 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించింది. కరప్షన్ పర్ సెప్షన్ ఇండెక్స్ లో మనద దేశం 86వ స్థానంలో ఉందన్నారు. నిజయితీ ఉన్న ప్రజా ప్రతిపతినిధి ఎలా ఉండాలనే విషయం పైన మాజీ ఎమ్మెల్యే రాములును ఉదాహరణగా పేర్కొన్నారు. అవినీతి నిరోధానికి సంబంధించి మాజీ జేడీ కీలక సూచనలు చేసారు.

English summary
CBI Former JD Laxmi Narayana Relases the Survey report on Curruption in govt Departements in Telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X