మాజీ సీజేఐ ఎన్వీ రమణకు అరుదైన గౌరవం..!!

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను అరుదైన గౌరవం వరించింది. సింగపూర్ లోని ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ (ఎస్ఐఎంసీ) ఆయనకు సభ్యత్వాన్ని అందించింది. ఇకపై ఆయన ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానెల్ లో సభ్యుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ గత ఏడాది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ విరమణ చేశారు.

మాజీ సిజెఐ ఎన్.వి.రమణ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ప్యానల్ సభ్యుడిగా నియమితులయ్యారు. సింగపూర్ కన్వెన్షన్ వీక్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణకు ఎస్ఐఎంసి చైర్ పర్సన్ జార్జ్ ఈ మేరకు నియామక పత్రాన్ని అందించారు. సింగపూర్ న్యాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కన్వెన్షన్ లో ఎస్ ఐ ఎం సి సహా 20 భాగస్వామ్య సంస్థలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జస్టిస్ రమణ.. టాటా ,రిలయన్స్, మహేంద్ర, ఆదిత్య, బిర్లా కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. మధ్యవర్తిత్వం ప్రోత్సహించడంతోపాటు మద్దతు కూడగట్టేలా జస్టిస్ ఎన్వి రమణ చొరవతో ప్రారంభించిన డిక్లరేషన్ ఆఫ్ ఇంటిపై ఆయా ఎన్ఎంసిలు సంతకాలు చేశాయి.

Former Chief Justice of India NV Ramana has been appointed member of the SIMC

జస్టిస్ రమణ న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కూడా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను అమితంగా ప్రోత్సహించేవారు. వివాదాలు తలెత్తినప్పుడు నేరుగా కోర్టులను ఆశ్రయించకుండా వాటిని పరిష్కరించుకునే దిశగా తొలుత మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోవాలని రమణ సూచించారు. దీని కారణంగా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య కోర్టులపై భారం తగ్గుతుందని పేర్కొనేవారు. హైదరాబాదులో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అండ్ మెడిటేషన్ సెంటర్ కు సంబంధించి మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమని చెప్పుకొచ్చారు. పలు సందర్భాల్లో మధ్యవర్తిత్వ కేంద్రాల ప్రాముఖ్యం గురించి బలంగా చెప్పిన ఆయన, ఎస్ఐఎంసీ లోని ఇంటర్నేషనల్ ప్యానల్ లో సభ్యుడిగా నియమితులు కావటం పైన పలువురు అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+