మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ !
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరో సారి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నారా ? అంటే ఆయన వర్గీయులు మాత్రం అవుననే అంటున్నారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం. అనూహ్యపరిణామాల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పీఠాన్ని అధిష్టించారు. అయితే ఆయన పేరుకు సీఎంగా ఉన్నారే తప్పా కుదరుగా ఉండలేకపోయారు.
ఓ పక్క సమైక్యాంధ్ర, మరో వైపు తెలంగాణ ఉద్యమం ఆయనను ఊపిరి తీసుకోనివ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పైకి మాత్రం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఇదే మాట గట్టిగా చెప్పారని సమాచారం.
మీడియా ముందు సైతం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన వద్దూ అంటూ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు మొదటి నుంచి వాయల్పాడు (వాల్మీకీపురం) నియోజక వర్గం నుంచి పోటీ చేసేవారు.
కిరణ్ కుమార్ రెడ్డి వాయల్పాడు నియోజక వర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే నియోజక వర్గాల పునర్విభజన తరువాత ఆయన పీలేరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపోందారు. కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన రాధికా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు చిత్తూరు జిల్లాలో కంటే నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.
సాధారణ ఎన్నికల ముందు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. ఆ పార్టీకి చెప్పులు గుర్తు వచ్చింది. ఆ పార్టీ తరపున పీలేరు నియోజక వర్గంలో కిరణ్ కుమార్ రెడ్డి సొంత సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి పోటీ చేసి చిత్తుచిత్తూగా ఓడిపోయారు.

ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి చింతల రామచంధ్రారెడ్డి విజయం సాధించారు. ఎక్కడ కూడా ఆపార్టీ అభ్యర్థి గెలవలేదు. కనీసం ఒక్కరికికూడా డిపాజిట్ దక్కలేదు. అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నెల్లూరులో పర్యటించిన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘువీరారెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు వేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి పదవి ఇవ్వాలి. సీఎంగా పని చేసిన వ్యక్తికి పీసీసీ అధ్యక్షుడి స్థానం, లేదా ఏఐసీసీలో ఓ పదవి ఇవ్వాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ లోని కొందరు పెద్దలు అడ్డుపడటంతో కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ ఆ పార్టీలో చేరలేకపోతున్నారని సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు కొందరు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం చేస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపిస్తే వైసీపీకి సేవలు అందిస్తారని అంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, బెంగళూరు, పీలేరు, నెల్లూరు ప్రాంతాల్లో పర్యటిస్తూ కాలం గడుపుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన చిత్తూరు ఎమ్మెల్సీ (మదనపల్లి) నరేష్ కుమార్ రెడ్డి కొన్ని నెలల క్రితం స్వయంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. మొత్తం మీద మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో ? అని వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications