టీవీల్లో ఆలాంటి వార్తలు చూసి పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ప్రజలు, చంద్రబాబు సంచలనం!
ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 లోక్ సభ నియోజక వర్గాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల ముందు ఉదయం నుంచి బారులుతీరిన ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో అన్ని పార్టీల నాయకుల్లో ఆశలు చిగిరిస్తున్నాయి.
ఓటింగ్ సమయం పూర్తి అయ్యే సమయానికి కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భారీగా క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రంలోని క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా స్లిప్ లు ఇచ్చి వారు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం ఆరు గంటల తరువాత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వెయ్యడానికి ప్రయత్నించిన ఓటర్లకు ఎన్నికల అధికారులు అవకాశం ఇవ్వలేదు.

ఎండ వేడమిని లెక్క చెయ్యకుండా, దాడులకు భయపడకుండా ఓటు వెయ్యడానికి ప్రజలు వచ్చారని, ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసిందని, ప్రజల ఉత్సాహం చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎన్నడూ లేని విధంగా చైతన్యం రావడంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థం అవుతోందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని పలు నియోజక వర్గాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల మీద, సామాన్య ప్రజల మీద దాడులు చేశారని, ఇలాంటి సంఘటనలు టీవీల్లో చూసిన ప్రజలు రగిలిపోయి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని నిర్ణయించుకున్నారని మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు ఓటుతో ప్రజలు తగినగుణపాఠం చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
పలు ప్రాంతాల్లో వైసీపీ నాయకుల తీరుతో విసిగిపోయిన ప్రజలు వారి మీద తిరగబడ్డారని, ఇలాంటి సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని అర్థం అవుతోందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ అరాచకాలను ఎదిరించడానికి ఇంతకాలం వేచి చూసిన ప్రజలు ఈరోజు ఎంతో ధైర్యంగా ఓటు వేశారని, ఓటు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.












Click it and Unblock the Notifications