ఇసుక ఫ్రీ అంటే ఇదేనా చంద్రబాబు, మాట మీద ఉంటారా, జగన్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రజలకు హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అతి తక్కువ ధరకే ఇసుక తీసుకు వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది.

టన్ను ఇసుక అతి తక్కువ ధర మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక సొంతంగా తవ్వుకుని వెళితే వాళ్ళ దగ్గర ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైయస్ జగన్ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్ లోని నివాసంలో వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడారు.

Former CM YS Jagan accused of free sand in Chandrababu Govt in Andhra Pradesh

ఉచిత ఇసుక అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ఇసుక ధరలు పెంచేసిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పడం ఎందుకు, ఆ ఇసుకను ఎక్కువ ధరకు విక్రయించడం ఎందుకు అని మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇసుక తీసే కాంట్రాక్టర్లు అందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని, పక్కా ప్లాన్ ప్రకారం ఇది జరిగిందని జగన్ ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నదాని ప్రకారమే ఇసుక కాంట్రాక్టులు దక్కించుకున్నారని జగన్ ఆరోపించారు. అందరూ దసరా పండగ బిజీలో ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇసుక కాంట్రాక్టులు తెలుగుదేశం పార్టీ నాయకులకు అప్పగించిందని జగన్ ఆరోపించారు. మా ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి అవకాశం లేకుండా పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని జగన్ అన్నారు.

Former CM YS Jagan accused of free sand in Chandrababu Govt in Andhra Pradesh

అయితే జగన్ చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సెటైర్లు వేస్తున్నారు. దేశంలోని ఇసుక బకాసురుడు ఎవరంటే జగన్ పేరే చెబుతారని, అలాంటి జగన్ ఇసుక ధరల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇసుకను ఎక్కువ ధరకు విక్రయించిన చరిత్ర వైసీపీ నాయకులకే ఉందని, జగన్ ప్రభుత్వంలో ఇసుకను వైసీపీ నాయకులు ఎంత ధరకు విక్రయించారో అని ప్రజలకు బాగా తెలుసని, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+