రాహుల్ ద్రావిడ్ వారసుడిగా ఖరార్..: శ్రీవారికి మొక్కు చెల్లించింది అందుకేనా?
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది. శనివారం నాడు 80,404 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 35,825 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.83 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగ్లా కాటేజీల వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు టీటీడీ సిబ్బంది.

టీమిండియా మాజీ ఓపెనర్, భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ మాజీ సభ్యుడు గౌతమ్ గంభీర్.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖాయం అయినట్టే. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నేడో, రేపో దీన్ని అధికారికంగా ప్రకటించబోతోంది. ఇదివరకే హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది కూడా. గంభీర్‌తో పాటు డబ్ల్యూవీ రామన్‌ను ఇంటర్వ్యూ నిర్వహించింది.

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి వచ్చింది బీసీసీఐకి. ఆ ఉద్దేశంతోనే రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు. ఈ రేసులో గౌతమ్ గంభీర్ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచాడు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉండటం, ఐపీఎల్‌లో తాను మెంటార్‌గా ఉంటోన్న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడం ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
కొత్త బాధ్యతలను స్వీకరించడం దాదాపుగా ఖాయం కావడం, టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024లో విజేతగా నిలిచినందు వల్ల గౌతమ్ గంభీర్.. తిరుమలకు వచ్చారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో సెల్ఫీ దిగడానికి భక్తులు పొటీ పడటం కనిపించింది. కప్ గెలిచిన ఇండియాకు బెస్ట్ విషెస్ చెప్పాడు గౌతీ.












Click it and Unblock the Notifications