అధికారంలోకి వస్తాం: పవన్ కళ్యాణ్, జనసేనలో చేరిన మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు
అమరావతి: మాజీ క్రికెటర్ వేణుగోపాల రావు గురువారం జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉన్నారు. జనసేనాని సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వేణుగోపాల రావు పార్టీ సభ్యత్వం తీసుకున్న సందర్భంలో పవన్ మాట్లాడారు.
Recommended Video

ఆసక్తికరం గా మారనున్న 2019 ఎన్నికలు
ప్రజా సమస్యలపై పోరాటం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ పని చేస్తుందని తెలిపారు. తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వేణుగోపాల రావు భారత్ తరఫున 2005లో ఆరంగేట్రం చేశారు. అప్పుడు అతను శ్రీలంకతో తొలి వన్డే ఆడారు. 2006లో వెస్టిండీస్‌తో చివరి వన్డే ఆడారు. 16 మ్యాచులలో 218 పరుగులు చేశారు.












Click it and Unblock the Notifications