14 ఏళ్లు సీఎంగా చేశారు కదా, స్కూళ్లు బాగు చేయాలని అప్పుడు గుర్తు రాలేదా?

Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. నేడు తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒకే రోజు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌ను ఏర్పాటు చేయడం ఒదే తొలిసారి. నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులను కలుసుకోవడం, విద్యా శాఖలో చేపట్టాల్సిన విప్లవాత్మక మార్పులకు వారి నుంచే సలహాలు, సూచనలను స్వీకరించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది.

Former Deputy CM Pushpa Srivani slams Chandrababu over Mega Parents-Teachers meeting

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సహా మంత్రులందరూ.. తమకు కేటాయించిన జిల్లాల్లో తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాల్లో పాల్గొన్నారు. స్థానికంగా పాఠశాలల అభిృద్ధి, విద్యార్థులకు మరింత మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్యను అందించడానికి సలహాలు, సూచనలను స్వీకరించారు.

ఇందులో భాగంగా- చంద్రబాబు, నారా లోకేష్ బాపట్లలో, పవన్ కల్యాణ్ కడప జిల్లాలో పర్యటించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో పిల్లలతో సమావేశం అయ్యారు. అటు పవన్ కల్యాణ్ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఘాటుగా స్పందించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం- బడి వైపు ఒక అడుగు కార్యక్రమంలో అన్నీ తానే చేసినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకొన్నారని విమర్శించారు.

ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలన్నింటినీ తానే కట్టినట్లు, అభివృధ్ధి చేసినట్లు మాట్లాడారని, వాటిలో ఎంత నిజం ఉందనేది విషయంపై ఒక్కసారి మనసాక్షిని ప్రశ్నించుకోవాలని పుష్ప శ్రీవాణి సూచించారు. 2014- 2019 మధ్య కాలంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అప్పట్లో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనను ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. ఆడబిడ్డలకి కావాల్సిన బాత్‌రూమ్స్ ఎందుకు కట్టించలేదని పుష్ప శ్రీవాణి నిలదీశారు. 44,303 ప్రభుత్వ బడులలో చదువుతున్న 35 లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లల భవిష్యత్తు గురించి 14 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఎందుకు గుర్తుకు రాలేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+