ఏర్పేడు ప్రమాదంలో ఇసుక మాఫియా హాస్తం?:బొజ్జల

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: ఏర్పేడులో లారీ భీభత్సం సృష్టించిన ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందేమోనని మాజీ మంత్రి , శ్రీకాళహాస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు.

సంఘటనా స్థలాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ ఘటనలో మరణించినవారంతా తమ పార్టీకి చెందినవారేనని చెప్పారు. తన నియోజకవర్గంలో ఇసుక మాఫియా లేకుండా చర్యలు తీసుకొంటానని ఆయన చెప్పారు.

bojjala gopalakrishna reddy

మరో వైపు ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకుగాను మంత్రి లోకేష్ మంత్రివర్గం సమావేశం ముగిసిన వెంటనే రోడ్డు మార్గంలో చిత్తూరుకు బయలుదేరి వెళ్ళారు.

అసలు ఈ ఘటనకు కారణాలేమిటనే విషయాన్ని ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇసుక మాఫియా ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి బలికావడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
former minister Bojjala Gopalakrishna Reddy suspected yerpedu road accident
Please Wait while comments are loading...