వైసీపీకి దాడి వీరభద్రరావు ఫ్యామిలీ గుడ్ బై-రేపు టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటన
ఏపీలో అనకాపల్లి జిల్లా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, అనుచరులు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధిష్టానానికి ఓ లేఖ రాశారు. ఈ లేఖ కాపీని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి కాపీలు పంపారు. అయితే రాజీనామాకు దారి తీసిన కారణాన్ని మాత్రం ఆయన లేఖలో పేర్కొనలేదు.

అనకాపల్లి జిల్లా వైసీపీ సీనియర్ నేత అయిన దాడి వీరభద్రరావు.. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు రత్నాకర్ కు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే జగన్ తాజా సర్వేల ప్రకారం టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్..అక్కడి నుంచి మారాలని భావించారు. దీంతో అనకాపల్లి సీటుపై దాడి ఫ్యామిలీ ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. కానీ అమర్నాథ్ మారినా తమకు మాత్రం టికెట్ దక్కదని తేలిపోవడంతో పార్టీని వీడినట్లు సమాచారం.
1985 ఎన్నికల్లో ఎన్టీఆర్ పెట్టిన టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన దాడి వీరభద్రరావు.. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. 1989, 19994, 1999 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2012 వరకూ దాడి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన దాడి ఫ్యామిలీ.. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో తిరిగి టీడీపీ గూటికి చేరారు. తిరిగి 2019 ఎన్నికల నాటికి వైసీపీలోకి వచ్చిన దాడి ఇప్పుడు మరోసారి ఆ పార్టీకి గుడ్ చై చెప్పి రేపు తిరిగి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications