వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యన్న వ్యాఖ్యల వెనుక ముఖ్య నేత - గంటా సందేహం : కీలక నిర్ణయం దిశగా..!?

|
Google Oneindia TeluguNews

విశాఖ కేంద్రంగా అధికార వైసీపీ కొత్త రాజకీయం మొదలు పెడుతోంది. టీడీపీని ఇరుకున పెట్టే వ్యూహాలు అమలు చేస్తోంది. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తు దాదాపు ఖాయం కావటంతో..ఈ రెండు పార్టీలు ఈ సారి విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పైన భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కానీ, తాజాగా గంటా పైన అయ్యన్న చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారనే కోణంలో గంటా అనుమానాలు వ్యక్తి చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఏం చేయాలనే అంశం పైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది.

అయ్యన్న వర్సస్ గంటా

అయ్యన్న వర్సస్ గంటా

టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తాజాగా మాజీ మంత్రి గంటాపై చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య వైరం మరోసారి చర్చకు వచ్చింది. ఇద్దరూ ఉమ్మడి విశాఖలో టీడీపీకి ముఖ్యనేతలే. 2019 ఎన్నికల్లో అయ్యన్న ఓడిపోగా.. గంటా గెలిచారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా..గంటా పార్టీ వ్యవహారాల్లో దూరంగానే ఉన్నారు. గంటా పార్టీ మార్పు వ్యవహారం పైన పలుమార్లు ప్రచారం సాగింది. తాజాగా.. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని స్పష్టత వచ్చిన తరువాత గంటా తన నిర్ణయం పైన స్పష్టత ఇచ్చారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. గంటా కు తొలి నుంచి ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ఒక వర్గం.. వారికి టికెట్లు..గెలిపించుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు విశాఖ నగరంలో గంటా బలమైన నేతగానే ఉన్నారు. గంటా తిరిగి టీడీపీలో యాక్టివ్ అవుతున్న వేళ అయ్యన్న చేసిన సీరియస్ వ్యాఖ్యలతో ఒక్క సారిగా విశాఖ జిల్లా టీడీపీ వర్గాల్లో కలకలం మొదలైంది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్న గంటా దీని వెనుక ఎవరున్నారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం

అయ్యన్న వ్యాఖ్యలతో గంటా చర్చలు..

అయ్యన్న వ్యాఖ్యలతో గంటా చర్చలు..


గంటా - అయ్యన్న టీడీపీలో సుదీర్ఘ కాలంగా ఉన్నారు. మధ్యలో గంటా పార్టీ మారినా.. అయ్యన్న టీడీపీలోనే కొనసాగారు. 2009లో ప్రజారాజ్యం నుంచి గంటా గెలుపొందారు. ఆ తరువాత కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్ కోటాలో చిరంజీవి మద్దతుతో కిరణ్ కేబినెట్ లో గంటా మంత్రిగా పని చేసారు. రాష్ట్ర విభజన కారణంగా తిరిగి 2014 వేళ టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గెలిచిన గంటా - అయ్యన్న ఇద్దరికీ చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా అవకాశం దక్కింది. ఆ సమయంలోనూ జిల్లా రాజకీయాల్లో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగింది. గంటా ప్రజారాజ్యం నుంచి టీడీపీలో చేరిన సమయంలో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకున్నారు. అయ్యన్న వ్యాఖ్యలు సొంతంగా చేస్తున్నారా..లేక ఎరవైనా ముఖ్య నేతలు వెనుక ఉన్నారా అనేది గంటా అనుమానంగా తెలుస్తోంది. దీని పైన సహచరుల వద్ద గంటా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇద్దరి నేతల పోరు..చంద్రబాబు నెక్స్ట్ స్టెప్

ఇద్దరి నేతల పోరు..చంద్రబాబు నెక్స్ట్ స్టెప్


ఇప్పుడు జనసేనతో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ..సీట్ల వ్యవహారంలో టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పొత్తు ఖరారు సంకేతాలతో గంటా తాను టీడీపీలో కొనసాగే అంశం పైన వ్యూహాత్మకంగానే క్లారిటీ ఇచ్చారు. కాపు నేతల సమావేశాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న గంటా ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో టీడీపీ లోనూ కీ రోల్ పోషించటం ఖాయంగా కనిపిస్తోంది. గంటాను విశాఖ రాజకీయాల్లో దూరం చేసుకోవటానికి చంద్రబాబు సిద్దంగా లేరు. ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నా..ఇద్దరినీ పార్టీ సేవలకు చంద్రబాబు గతంలో లాగానే వినియోగించుకోవటానికి సిద్దం అవుతున్నారు. అయ్యన్న తన మనసులోని భావాలను ఓపెన్ గా చెప్పేస్తారు. గంటా సైలెంట్ ఆపరేషన్ తో తాను చేయదలచుకున్నది చేస్తారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ ఇద్దరి నేతల పంచాయితీ ఎటువంటి పరిణామాలకు దీరి తీస్తుందనేది చూడాలి.

English summary
TDP Senior leaders Ayyanna Patrudu Vs Ganta Srinivasa Rao cold war became big task for party president Chandra Babu ahead Assembly Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X