వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేపర్ లీక్ కేసులోనే నారాయణ అరెస్ట్-సీఎంతో భేటీ తర్వాత మంత్రి బొత్స స్పష్టత

|
Google Oneindia TeluguNews

ఏపీలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్ధల అధినేత నారాయణ అరెస్టు రాజకీయంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ఆయన్ను ఇవాళ హైదరాబాద్ లో అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ సీఐడీ రాజధాని వ్యవహారాల్లో మరో కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏ కేసులో నారాయణను అరెస్టు చేశారన్న సస్పెన్స్ కూడా నెలకొంది.

Recommended Video

Big Breaking AP Ex Minister Narayana Arrested | Telugu Oneindia

మాజీ మంత్రి నారాయణ అరెస్టు నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ ను కలిసిన బొత్స సత్యనారాయణ.. అనంతరం బయటికి వచ్చాక నారాయణ అరెస్టుకు దారి తీసిన పరిస్దితుల్ని వివరించారు. ఇప్పటివరకూ పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో 60 మందిని అరెస్టు చేశామని బొత్స తెలిపారు. పోలీసులు వాస్తవాలు తెలుసుకునే చెప్తారని ఆయన వెల్లడించారు. పోలీసుల ప్రకటన తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయని బొత్స తెలిపారు.

former minister narayana arrest in ssc paper leak case, says minister botsa after cm meet

ప్రస్తుతం టెన్త్ పేపర్ లీక్ కేసులోనే మాజీ మంత్రి నారాయణ అరెస్టు అయ్యారని విద్యామంత్రి బొత్స తెలిపారు.
టెన్త్ పేపర్ లీక్ లో ఎవరున్నా అరెస్ట్ తప్పదని ఆయన హెచ్చరించారు. రాజకీయంగా అనేక విమర్శలు వస్తాయి కానీ పోలీసులు, దర్యాప్తు సంస్థలు అన్న తేలుస్తాయని బొత్స తెలిపారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరగకపోతే ఎందుకు కేసులు పెడతారంటూ మరో ప్రశ్నకు సమాధానంగా బొత్స తెలిపారు. దీంతో నారాయణను ప్రస్తుతానికి పేపర్ లీక్ కేసులో అరెస్టు చేసినా మరికొన్ని ఇతర కేసుల్లోనూ ఆయన్ను అరెస్టు చేసి చూపే అవకాశాలూ లేకపోలేదు.

English summary
ap education minister botsa satyanarayana on today met cm jagan and said that former minister narayana has been arrested in ssc question paper leak case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X