మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు - కోర్టు తాజా ఆదేశం..!!

టీడీపీ మాజీ మంత్రి నారాయణ బెయిల్ ను రద్దు చేస్తూ కోర్టు ఆదేశించింది. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసులో భాగంగా హైదరాబాద్ లో నారాయణను అరెస్ట్ చేసి చిత్తూరులో కోర్టులో ప్రవేశ పెట్టారు.ఆయనపై పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి సులోచనారాణి వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిలు మంజూరు చేశారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు చూపించారు.

ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. ఆ సమయంలో కోర్టు వెంటనే నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. తన పైన నమోదైన ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసుల పైన స్పందించిన నారాయణ నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, ఇంకా దాని అధినేతగానే ఉన్నానని పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. దానితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని వెల్లడించారు. ఈ కేసులో నారాయణతో పాటుగా నారాయణ విద్యా సంస్థలకు చెందిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.

Former minister Narayana bail cancelled by Chittor court in Tenth class question paper leakage case

నారాయణకు బెయిల్ ఇవ్వటంతో దీని పైన జిల్లా పోలీసులు వెంటనే జిల్లా కోర్టులో బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన చిత్తూరు జిల్లా 9వ అదనపు కోర్టులో విచారణ జరిగింది. విచారణ పూర్తయిన తరువాత నారాయణ బెయిల్ రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే నెల 30వ తేదీ లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంలో ఏపీలో రాజకీయంగానూ దుమారం చెలరేగింది. నారాయణ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకెళ్లటాన్ని టీడీపీ నేతలు తప్పు బట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+