మాజీ మంత్రి రజినీకి బిగ్ షాక్.. ఆ కేసులోనే ఆమె మరిది అరెస్ట్ !
మాజీ మంత్రి విడదల రజినికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది విడదల గోపీనాథ్ ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో ఆయనని అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడకు తరలిస్తున్నారు.
2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రిని ఏ1గా చేర్చిన ఏసీబీ అధికారులు.. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ రామకృష్ణలను చేర్చారు. ఆ కేసులో విడదల రజనికి 2 కోట్లు.. గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు.

మరోవైపు గత కొంత కాలంగా మాజీ మంత్రిపై వరుసగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. పసుమర్రు గ్రామంలో జగనన్న కాలనీకి సంబంధించిన స్థల సేకరణ విషయంలో రైతుల నుంచి కమీషన్ల పేరిట డబ్బు వసూలు చేశారని కొందరు కంప్లయింట్ చేశారు. దాంతో మళ్లీ డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేశారని జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాకుండా ఐ టీడీపీ నేత పిల్లికోటి అనే వ్యక్తి.. తనను వేధించారంటూ రజినీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాడు.
అయితే వరుసగా ఒకదాని తర్వాత మరో కేసు నమోదు అవుతున్న తరుణంలో.. ఇది ప్రభుత్వం కక్ష్య పూరిత చర్య అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెడ్ బుక్ పాలన అంటే ఇదేనని వైసీపీ నాయకులను, కార్యకర్తలను వేధించడమే వారి టార్గెట్ అంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications