Tirumala laddu: చంద్రబాబుపై సుప్రీం వ్యాఖ్యలపై మాజీమంత్రి రోజా రియాక్షన్!
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం పైన నేడు సుప్రీంకోర్టులో విచారణలో సుప్రీం ధర్మాసనం చంద్రబాబుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది . తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బిజెపి మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబుకి సుప్రీం చివాట్లు
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరిచారని సుప్రీం ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ జరిగిందని సాక్ష్యం ఉందా? నెయ్యి కల్తీ పైన సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్ లో చెప్పారు ఎందుకు అంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టాలని చివాట్లు పెట్టింది.

సుప్రీం వ్యాఖ్యలపై స్పందించిన రోజా
అక్టోబర్ మూడవ తేదీ వరకు ఈ కేసును వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి రోజా స్పందించారు చంద్రబాబు పూర్తిగా తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాలను దెబ్బతీశారని, మళ్ళీ ఆ భక్తుల మనోభావాలను పునరుద్ధరించాలని దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని కేసును స్వీకరించటం జరిగిందని పేర్కొన్నారు.
చంద్రబాబు టార్గెట్ కేవలం జగన్
ఈ కేసులో సుప్రీంకోర్టు డైరెక్ట్ గా విచారణ జరిపితే చంద్రబాబు నాయుడు అండ్ కో యొక్క అబద్ధాలు కచ్చితంగా బయటకు వస్తాయని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ఒక సీఎం స్థాయిలో తప్పు జరిగిందా లేదా అన్నది విచారణ జరపకుండా ఎటువంటి సాక్షాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయన మీద నింద వెయ్యాలి, ఆయనను హిందువులకు దూరం చేయాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వ్యాఖ్యలు చేశారన్నారు.
చంద్రబాబు వేసిన సిట్ పై రోజా అభిప్రాయం ఇదే
ఈరోజు సుప్రీంకోర్టు కేసును తీసుకునే వరకు హడావిడిగా సిట్ వేసి విచారణ జరిపిస్తున్నారని ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్ధం బయటపడుతుంది అన్న భయంతో చంద్రబాబు సిట్ వేశారని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు వేసిన సిట్ అధికారులు చంద్రబాబు చేసిన ప్రకటనకే లోబడి వారు కూడా అబద్ధాలు మాట్లాడుతారని నిజాలు చెప్పరని మాజీ మంత్రి రోజా అభిప్రాయపడ్డారు.
సీబీఐ విచారణ జరిగితే అన్నీ బయటకు వస్తాయన్న రోజా
చంద్రబాబు వేసిన సిట్ సిట్ అండ్ స్టాండ్ కు తప్ప దేనికి పనికిరాదని అర్థమైందని ఆమె అన్నారు. అందుకే తాము మొదటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ జరగాలని, సిబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశామని, అదే గనక జరిగితే చంద్రబాబు నాయుడు అండ్ కో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చేసిన ప్రయత్నం బయటకు వస్తుందని, అందరికీ బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని రోజా అభిప్రాయపడ్డారు.
సిబిఐకి అప్పగించి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చెయ్యాలన్న రోజా
ఈరోజు విచారణ ప్రారంభమైంది కాబట్టి ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభావాలను గౌరవించిన వాళ్ళమవుతామని, లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డుని తినాలా వద్దా? దీంట్లో ఏం కలిసిందో ఏమో అన్న అనుమానాలను భక్తులకు కలిగిస్తుందని రోజా అన్నారు.
సుప్రీం ధర్మాసనం కలుగజేసుకోవాలి
తిరుమలకు వచ్చిన వారు తిరుపతి లడ్డు తినకుండా వెళ్ళిపోతుంటే తిరుపతి అమ్మాయిగా నాకు చాలా బాధేస్తుందని రోజా వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన అంశాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు కను సన్నలలో ఏర్పాటు చేసిన సిట్ పై తమకు ఏమాత్రం నమ్మకం లేదని ఈ కేసులో సుప్రీంకోర్టు కలుగజేసుకోవాలని కోరుతున్నానని మాజీ మంత్రి రోజా సుప్రీం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications