చంద్రబాబు చేసిన పెద్ద మిస్టేక్ అదే - ఇక నో ఛాన్స్..!!
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోన్నారు. సభలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న వైఖరి, ప్రభుత్వ పాలన తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఇకపై తాను అసెంబ్లీలో అడుగు పెట్టడమంటూ జరిగితే- అది ముఖ్యమంత్రి హోదాలో మాత్రమేననీ ప్రతిజ్ఞ చేశారు చంద్రబాబు.

వెల్లంపల్లి ఫైర్..
చంద్రబాబు సభకు హాజరు కావాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఒకరిద్దరు మంత్రులు చేసిన ఛాలెంజ్‌ను పెద్దగా పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఈ పరిణామాలపై తాజాగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ చంద్రబాబు ప్రకటన చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఇకపై ఆయన జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టలేరని, దీనికి అనుగుణంగా తమ పార్టీ కసరత్తు చేస్తోందని, ప్రభుత్వ పరిపాలన సాగుతోందని చెప్పారు.

ఎమ్మెల్యేగా కూడా..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాదు కదా.. కనీసం శాసన సభ్యుడిగా కూడా గెలవలేడని వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కుప్పంలో పోటీ చేయడానికి చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో గ్రామ పంచాయతీలు మొదలుకుని మున్సిపాలిటీల వరకు అన్ని స్థానిక సంస్థల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పారు.

తన తలరాతను తానే..
ఈ రెండు సంవత్సరాల కాలం పాటు అసెంబ్లీకి వెళ్లే అవకాశం చంద్రబాబుకు ఉండేదని, దాన్ని ఆయన చేజేతులా పోగొట్టుకున్నారని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన తలరాతను తానే రాసుకున్నాడని అన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగించడానికే ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోన్నామని అన్నారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యత..
దీనిపై ఇదివరకే దేవాదాయ శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారని వెల్లంపల్లి వివరించారు. దుర్గగుడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా త్వరితగతిన అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు లక్షల సంఖ్యలో వస్తారని, వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications