విడదల రజిని ఫోన్ స్విచాఫ్?: ఆ పార్టీతో టచ్

Vidadala Rajini: మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్ముందు మరిన్ని షాకులు తప్పేలా లేవు. ఎన్నికల ముందు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన నాయకులు.. ఫలితాల తరువాత వెనుదిరుగుతున్నారు. పార్టీని వీడుతున్నారు.

ఫలితాలు వెలువడిన ఈ రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పని చేసిన రావెల్ కిశోర్ బాబు, శిద్ధా రాఘవరావు.. బయటికెళ్లిపోయారు. పార్టీకి రాజీనామా చేశారు.

Former Minister Vidadala Rajani Reportedly in Talks with National Parties for Possible Switch

ఇప్పుడు అదే జాబితాలో విడుదల రజినీ చేరబోతోన్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కష్టమౌతుందని భావించిన ఆమె ఎక్కువ రోజులు ఇక్కడ కొనసాగకూడదనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో అత్యంత ప్రాధాన్యత గల వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షించారు విడదల రజిని. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం వల్ల జగన్ ఆమెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో, మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడదల రజిని చాలా జూనియర్. అయినప్పటికీ- ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు.

2019 నాటి ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన రజినికి స్థానచలనం కలిగిన విషయం తెలిసిందే. ఈ దఫా ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా మాధవి చేతిలో 51 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

Former Minister Vidadala Rajani Reportedly in Talks with National Parties for Possible Switch

ఈ ఓటమితో విడదల రజిని తీవ్ర నిరాశకు గురయ్యారని, అటు పార్టీ కూడా 11 స్థానాలకే పరిమితం కావడం వల్ల ఇందులో కొనసాగాలనే నిర్ణయంపై పునరాలోచన చేస్తోన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చర్చించారని తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీలో చేరకముందు ఆమె తెలుగుదేశంలో చాలాకాలం పాటు పని చేశారు.

ఈ క్రమంలో విడదల రజిని ఓ జాతీయ పార్టీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఏది అనేది స్పష్టత రాలేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే టీడీపీతో జత కట్టింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోంది. ఇక కాంగ్రెస్‌. దాదాపుగా ఉనికిలో లేని కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉండకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+