Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోరంట్ల మాధవ్‌కు కీలక బాధ్యతను అప్పగించిన జగన్: కంచుకోటపై ఫోకస్

Gorantla Madhav: వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియామకాల పరంపర కొనసాగుతోంది. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండటం వల్ల దీనికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ కమిటీల వరకూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

జమిలికి అవకాశం..

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం సైతం దీనికి ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లు సభ ముందుకు సైతం వచ్చింది. ఫలితంగా 2027 నాటికి జమిలి ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది.

Former MP Gorantla Madhav has been appointed as a Official spokesperson to YSRCP

పార్టీ బలోపేతంపై..

ఈ పరిస్థితుల్లో ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇదివరకే రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. దీన్ని మరింత వేగవంతం చేశారాయన.

రాష్ట్రస్థాయి పదవులు..

ఇప్పటికే పలువురు నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఖరారు చేశారు. జిల్లాలకు అధ్యక్షులనూ నియమించారు. ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనలకు పూనుకున్నందున ఈలోగా బూత్ స్థాయి వరకు పార్టీపరంగా అన్ని పదవులను భర్తీ చేయడంపై ఫోకస్ పెట్టారు.

గోరంట్ల మాధవ్‌..

తాజాగా- శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు గోరంట్ల మాధవ్‌కు పార్టీలో హోదా కల్పించారు. ఆయనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేర‌కు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

బీసీ నేతగా..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలమైన కురుబ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు గోరంట్ల మాధవ్. 2019 నాటి ఎన్నికల్లో హిందూపురం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్పను సుమారు లక్షన్న ఓట్ల తేడాతో మట్టికరిపించారు.

మరోసారి ఆయననే..

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయనకు దక్కలేదు. హిందూపురం లోక్‌సభ టికెట్‌ను జొలదరాశి శాంతకు కేటాయించింది వైసీపీ. అయినా ఫలితం దక్కలేదు. ఇక్కడ పసుపు జెండా ఎగిరింది. టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి భారీ మెజారిటీతో శాంతను ఓడించారు. ఈ పరిణామాల మధ్య గోరంట్ల మాధవ్‌ను నమ్ముకుంది వైసీపీ. ఆయనకు పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాను కల్పించింది.

టీడీపీ కంచుకోటపై..

తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం. ఈ ఏడాది ఎన్నికల్లో దీని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి అభ్యర్థులు ఊడ్చి పడేశారు. రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి స్థానాలను టీడీపీ గెలుచుకోగా ధర్మవరం.. బీజేపీ ఖాతాలో పడింది. ఇక్కడి నుంచి వై సత్యకుమార్ విజయం సాధించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+