మద్యం మత్తులో అర్ధరాత్రి మాజీ ఎంపీ తనయుడి వీరంగం

హైదరాబాద్: మద్యం మత్తులో మాజీ పార్లమెంటు సభ్యుడి తనయుడు ఒకరు వీరంగం సృష్టించాడు. అర్ధరాత్రి పూట రోడ్డు పైనే మద్యం సేవించి హల్ చల్ చేశాడు. అడ్డుకోబోయిన పోలీసుల పైన దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. పోలీసులు అతనిని స్టేషన్‌కు తరలించారని సమాచారం. అయితే, తనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని అతను చెబుతున్నారు.

 Former MP's son hulchul at midnight

పెట్రోల్ బంకులో దోపిడీ దొంగల స్వైర విహారం

గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగల స్వైర విహారం చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నెల్లూరులోని వైన్ షాపుపై దాడికి దిగి ఓ వ్యక్తిని చంపేసి మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరచడమే కాక నగదును దోచుకెళ్లిన విషయం తెలిసిందే.

ఇప్పుడు, దోపిడీ దొంగలు, సోమవారం రాత్రి గుంటూరు జిల్లాలో చెలరేగిపోయారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు పెట్రోల్ బంకులో దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారు. పెట్రోల్ బంకులోని ముగ్గురు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసిన దొంగలు నగదును అపహరించుకుని వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

బస్సు బోల్తా: విరిగిన విద్యార్థి చేయి

ప్రైవేటు పాఠశాల బోల్తాపడి 10 మంది విద్యార్థులు గాయపడిన సంఘటన సోమవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో చోటుచేసుకొంది. త్రిపురాంతకంలోని ప్రయివేట్‌ పాఠశాలకు చెందిన బస్సు అన్నసముద్రంలో విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా అదు పుతప్పి గణపవరం సమీపంలో బోల్తా పడటంతో నాలుగో తరగతి విద్యార్థి అజయ్‌కుమార్‌ ఎడమ చేయి విరిగింది. మరో 9 మందికి గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+