వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు షాక్: నంద్యాల మాజీ మున్సిఫల్ ఛైర్మెన్ నౌమన్ టిడిపిలో చేరిక

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. నంద్యాల మాజీ మున్సిఫల్ చైర్ పర్సన్ నౌమన్ టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు.ఎన్నికల సమయంలో నౌమన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. నంద్యాల మాజీ మున్సిఫల్ చైర్ పర్సన్ నౌమన్ టిడిపి తీర్థం పుచ్చుకొన్నారు.ఎన్నికల సమయంలో నౌమన్ టిడిపిలో చేరడం ఆ పార్టీకి కలిసిరానుంది.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది.అయితే వైసీపీ నుండి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, మంత్రి భూమ అఖిలప్రియ మధ్య మాటల యుద్దం సాగుతోంది.

టిడిపిని ఈ అసెంబ్లీ స్థానంలో ఓడించి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో తన అభ్యర్థిగా బరిలోకి దింపింది జగన్ పార్టీ.

Recommended Video

శిల్పా పార్టీని వీడకుండా చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ కాలేదు. కానీ టిడిపిని శిల్పా వీడారు. అయితే పార్టీని వీడిన తర్వాత తన వర్గాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి శిల్పా మోహన్ రెడ్డికి. టిడిపి చేస్తున్న ప్రయత్నాలు శిల్పాకు ఇబ్బంది కల్గిస్తున్నాయి.

మాజీ మున్సిఫల్ చైర్ పర్సన్ నౌమన్ టిడిపిలో చేరిక

మాజీ మున్సిఫల్ చైర్ పర్సన్ నౌమన్ టిడిపిలో చేరిక

నంద్యాల మాజీ మున్సిఫల్ ఛైర్మెన్ నౌమన్ ఆదివారం నాడు టిడిపిలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నౌమన అత్యంత సన్నిహితుడుగా పేరుంది. నంద్యాల మున్సిపాలిటీలో ముస్లిం మైనారిటీల ఓట్లు గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.అయితే ఈ సమయంలో నౌమన్ టిడిపిలో చేరడం రాజకీయంగా ఆ పార్టీకి కలిసిరానుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నాడు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు.

పదవిపైనే శిల్పాకు ఆశ

పదవిపైనే శిల్పాకు ఆశ

మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి పదవిపైనే ఆశ అని ఏపీ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిప్పులు చెరిగారు.పార్టీ ఆయన కోసం ఎంత చేసినా ఆయన పార్టీకి నష్టం చేసే ప్రయత్నాలను చేశారని ఆమె విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో నంద్యాలలో టిడిపి జెండాను ఎగురవేస్తామన్నారు అఖిలప్రియ.ఎమ్మెల్యేపై పదవిపై ఆశతోనే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారారని ఆమె ధ్వజమెత్తారు.

ముస్లిం ఓటర్లే కీలకం

ముస్లిం ఓటర్లే కీలకం

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు కీలకం. గతంలో ఈ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి, టిడిపి నాయకుడు ఎన్ఎం డి ఫరూక్ గెలుపులో ముస్లిం ఓటర్లు కీలకం. అయితే గతంలో శిల్పా మోహన్ రెడ్డి విజయంలోనూ, 2014 లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కీలకంగా మారారు. అయితే గత ఎన్నికల్లో టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకొన్నందున ముస్లింలు తనకు ఓటు చేయలేదని, ఈ కారణంగానే తాను ఓటమిపాలైనట్టు శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు.అయితే డాక్టర్ గానే కాదు, మున్సిఫల్ చైర్మెన్ గా పనిచేసిన నౌమన్ టిడిపిలో చేరడం రాజకీయంగా ఆ పార్టీకి కలిసివస్తోందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.

సంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన వైసీపీ

సంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన వైసీపీ

ప్రజాప్రతినిధులు హఠాత్తుగా మరణిస్తే వారి కుటుంబం నుండి ఎవరైనా పోటీచేస్తే వారికి మద్దతివ్వడం సంప్రదాయంగా వస్తోంది.అయితే వైసీపీ ఈ సంప్రదాయానికి తిలోదకాలను ఇచ్చిందని టిడిపి ఆరోపిస్తోంది. వైసీపీ నాయకత్వం సంప్రదాయాలకు తిలోదకాలను ఇచ్చిందని మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు.నంద్యాలను అన్ని రకాలుగా అభివృద్ది చేస్తున్నట్టు ప్రకటించారు.

English summary
Former Nandyal municipal chairman nouman joined in Tdp on Sunday at Amaravati.Chandrababu naidu assured to devolap to Nandyala municipality as a model town said nouman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X