టీడీపీలోకి మాజీ పీసీసీ చీఫ్ - కీలక హామీ..!!
ఏపీలో ఎన్నికల వేల పార్టీల్లో చేరికలు పెరిగాయి. అనంతపురం జిల్లాలో తిరిగి పూర్వ వైభవం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం జగన్ ఓన్ చేసుకుంటున్న సామాజిక వర్గాల పైన ఇప్పుడు టీడీపీ ఫోకస్ చేస్తోంది. అనంతపురం జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఇదే సమయంలో జిల్లాకు చెందిన సీనియర్ నేత, పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సాకే శైలజానాధ్ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమవుతోంది. సీటు పైన ఆయనకు హామీ దక్కినట్లుగా తెలుస్తోంది.
టీడీపీలోకి ఎంట్రీ:రాయలసీమలో అనంతపురం టీడీపీకి తొలి నుంచి బలం ఉన్న జిల్లా. 2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అదే 2019 ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లకే పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నివేదికలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఐ పాక్ క్షేత్ర స్థాయి సమాచారం సేకరించి పార్టీ అధినేతకు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన సాకే శైలజానాధ్ టీడీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. గతంలో శైలజానాద్ శింగనమల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ హయాంలో విప్ గా.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. రాష్ట్ర విభజన తరువాత పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. కానీ, కొద్ది రోజుల క్రితం శైలజానాద్ ను పీసీసీ చీఫ్ గా తప్పించి గిడుగు రుద్రరాజుకు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు ఏఐసీసీ అప్పగించింది. దీంతో, శైలజానాధ్ కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. త్వరలోనే పార్టీ మార్పుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

శింగనమల నుంచే..:వచ్చే ఎన్నికల్లో తాను శింగనమల నుంచే పోటీ చేస్తానని శైలజానాధ్ ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది మాత్రం త్వరలో చెబుతానంటూ వెల్లడించారు. ఇప్పటికే శైలజానాద్ టీడీపీ ముఖ్య నాయకత్వం తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. శైలజానాద్ 2004, 2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ సీనియర్ నేత శమంతమణి పైన విజయం సాధించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శమంతకమణికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో శంమతకమణి కుమార్తె యామినీ బాల టీడీపీ నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పైన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి పైన జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బండారు శ్రావణి టీడీపీ నుంచి తిరిగి సీటు ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. శింగనమల నుంచి తనకు సీటు ఖరారు చేయాలని శైలజా నాధ్ కోరినట్లు సమాచారం.
జేసీతో సుదీర్ఘ మంతనాలు:జిల్లాకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తాజాగా శైలజానాధ్ ఇంటికి వెళ్లారు. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. జిల్లాలో కాంగ్రెస్ లో ఇద్దరు సుదీర్ఘ కాలం పని చేసారు. ఇప్పుడు శైలజానాధ్ టీడీపీలోకి వచ్చే వేళ జేసీ వెళ్లి కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, శైలజానాధ్ ఆహ్వానం మేరకే జేసీ వెళ్లారనే ప్రచారం ఉంది. జిల్లాలో తన వర్గాన్ని బలోపేతం చేసుకొనేందుకు జేసీ ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఇప్పుడు శైలజానాధ్ టీటీలోకి రావటం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న సమయంలోనే ఈ భేటీ జరినట్లుగా తెలుస్తోంది.చంద్రబాబు నుంచి హామీ తోనే శైలజానాధ్ టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా అవకాశం దక్కకుంటే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications