మన్మోహన్ రెండో సారి ప్రధానిగా, వైఎస్సార్ కీ రోల్ - చెరగని ముద్ర..!!

మాజీ ప్రధాని మన్మోహన్ కు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. మన్మోహన్ రెండో సారి ప్రధాని కావటం వెనుక వైఎస్సార్ కారణమని ఆయనే పలు సందర్భాల్లో తెలుగు రాష్ట్రాలకు చెం దిన నేతలతో చెప్పేవారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు..యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా భావించిన జాతీయ ఉపాధి హామీ పథకం సైతం ఏపీ నుంచే ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని హోదాలో పలు సందర్భాల్లో మన్మోహన్ పర్యటించారు. హైదరాబాద్ లో పలు పథకాలకు ఆమోదంలోనూ మన్మోహన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

వైఎస్ తో అనుబంధం
మన్మోహన్ సింగ్ 2004, 2009 లో వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. పదేళ్ల పాటు ప్రధాని పదవిలో కొనసాగారు. 2009 లో ప్రధాని కావటం వెనుక ఏపీకి నాడు సీఎంగా ఉన్న వైఎస్సార్ పాత్ర గురించి పలు సందర్బాల్లో మన్మోహన్ చెప్పిన సందర్బాలు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. నాడు కాంగ్రెస్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 33 మంది ఎంపీలు గెలుపొందారు. వారి గెలుపు వెనుక వైఎస్సార్ కారణమని మన్మోహన్ విశ్వసించారు. అదే విధంగా నాటి రాజకీయ పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కొని రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను వైఎస్ అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక, సీఎంగా వైఎస్సార్ నాడు ఏపీకి పలు ప్రాజెక్టులను మన్మోహన్ తో చర్చల ద్వారా సాధించారు.

Former PM Manmohan emotional Attachment with YSR and Telugu states Details here

సీమ రాగి సంగటి రుచి చూసి
కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం నాడు ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఉపాధి హామీ పథకం సైతం ఏపీ నుంచే ప్రారంభించారు. అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006, ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో తొలిసారిగా ప్రారంభించా రు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ-1 చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, అప్పటి సీఎం వైఎస్సార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు, కూలీల వలసల నివారణ కోసం ఈ పథకాన్ని దేశంలో మొదటిసారిగా ప్రారంభిం చారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కరువుపై పోరాటం చేసేందుకు మద్దతుగా ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. సర్పంచ్‌తో కలిసి రాయలసీమ రాగి సంగటిని మన్మోహన్‌, సోనియా తిన్నారు.

తెలుగు రాష్ట్రాల పై చెరగని ముద్ర
యూపీఏ అధికారం కోల్పో యిన తరువాత కూడా మాజీ ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ మరోమారు అనంతపురం జిల్లాకు వచ్చారు. ప్రధాని హోదా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో.. వైఎస్సార్ మరణం సమయంలో హైదరాబాద్ .. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వేళ హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు జరిగిన సమయంలోనూ మన్మోహన్ రాష్ట్రానికి వచ్చారు. రోశయ్య ప్రధానిగా ఉన్న సమయంలో శ్రీకాళహస్తి వద్ద జరిగిన పలు కార్యక్రమాల్లో మన్మోహన్ పాల్గొన్నారు. ఇక, హైదరాబాద్ కు మెట్రో, ఓఆర్ఆర్, విమానాశ్రయ విస్తరణ పనులకు మన్మోహన్ పూర్తి స్థాయిలో సహకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+