టీడీపీకి భారీ ఊరట: మాజీ ఎమ్మెల్యే జాయిన్: చంద్రబాబు సమక్షంలో..!!

తిరుపతి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ ఊరట లభించింది. జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు- తన కుమారుడితో సహా టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు.

తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంత జిల్లా అయినప్పటికీ- పార్టీ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయనే అభిప్రాయం జిల్లా రాజకీయాల్లో నెలకొని ఉంది. పంచాయతీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు తిరుపతి లోక్ సభకు జరిగిన ఉప ఎన్నిక రిజల్ట్ కూడా అదే విషయాన్ని ప్రతిఫలింపజేసింది.

కుప్పంపై ఫోకస్..

కుప్పంపై ఫోకస్..

ప్రత్యేకించి- కుప్పం నియోజకవర్గంలోనూ టీడీపీకి ఎదురు గాలి వీస్తోన్న నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ లేనివిధంగా ఆయన తరచూ జిల్లా పర్యటనకు వస్తోన్నారు. రోజుల తరబడి కుప్పంలో మకాం వేస్తోన్నారు. వచ్చిన ప్రతీసారి మూడు నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు కుప్పం ఓటర్లను కలుసుకుంటోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తన నివాసాన్ని కూడా అక్కడే మార్చుకోబోతున్నారు.

 భారీ ఊరట..

భారీ ఊరట..

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీకి భారీ ఊరట లభించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాజీ శాసన సభ్యుడు మునిరామయ్య టీడీపీలో చేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో తన కుమారుడు ప్రవీణ్ తో కలిసి పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా చంద్రబాబు వారితో గడిపారు.

 టీడీపీలో జాయిన్

టీడీపీలో జాయిన్

1985 అసెంబ్లీ ఎన్నికల్లో మునిరామయ్య తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ లో చేరారు. 1999లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు గానీ విజయం సాధించలేకపోయారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత పెద్దగా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనలేదు. తాజాగా తన కుమారుడు ప్రవీణ్ తో కలిసి టీడీపీలో చేరారు.

 పోటీ చేస్తారా?

పోటీ చేస్తారా?

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది శ్రీకాళహస్తి నియోజకవర్గం. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీకి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డిపై 38,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ లభించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో- మునిరామయ్య టీడీపీలో చేరడం ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+