ఆంధ్రాలో అప్పుడే తేడా కొట్టింది, టీడీపీ vs బీజేపీ, సైలెంట్ అయిన జనసేన

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు నెలలు మాత్రమే అయ్యింది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో అందరూ ఒకటేనని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని మూడు పార్టీలకు చెందిన నాయకులు పదేపదే చెబుతున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోనిలో కథ అడ్డం తిరిగింది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ పార్టీల నాయకులు అనుకున్నట్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ చెందిన ఓ ఎమ్మెల్యే కూడా మంత్రులుగా పని చేస్తున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోనిలో బీజేపీ, టీడీపీల మధ్య తేడాలు వచ్చాయి. ఆదోని సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Former TDP MLA who made sensational comments on BJP MLA

మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్థసారధికి కొమ్ములు వచ్చాయని, కూటమి ప్రభుత్వం నియమ, నిబంధనలు గురించి పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆరోపణలపై బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా ఆదోనిలో కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో స్థానిక ప్రజలు షాక్ అయ్యారు.
ఆదోని టీడీపీ నాయకులను బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పట్టించుకోవడంలేదని, ప్రభుత్వ కార్యక్రమాలు గురించి మాకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని, ఇదేనా కూటమి ప్రభుత్వం ధర్మం అని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి ఇలాగే ప్రవర్తిస్తే మా సత్తా ఏమిటో చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిని హెచ్చరించారు.

Former TDP MLA who made sensational comments on BJP MLA
ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదోనిలో తెలుగుదేశం పార్టీలో ఐదు గ్రూపులు ఉన్నాయని ఆరోపించారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు టీడీపీలొని ప్రతి గ్రూపు, జనసేన నాయకులు తనకు పూర్తిగా సహకరించారని, ఇప్పుడు తాను కూడా అన్ని గ్రూపులకు ఒకే ప్రాధాన్యత ఇస్తున్నానని, అనవసరంగా నా మీద ఆరోపణలు చెయ్యడం సబబు కాదని డాక్టర్ పార్థసారథి అన్నారు.

ఆదోని పట్టణం అభివృద్ధి తన మొదటి ప్రాధాన్యత అని, సీఎం చంద్రబాబు నాయుడు కూడా తనకు అదే మాట చెప్పారని, ఆదోనిలో తాను గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించనని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం రోజున కూటమి ప్రభుత్వంలోని బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరిప ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఆదోని ప్రజలు షాక్ అయ్యారు. ఈ వ్యవహారం ఎక్కడ వరకు దారి తీస్తుందో వేసి చూడాలని ఆదోని ప్రజలు అంటున్నారు. అయితే టీడీపీ, బీజేపీ మధ్య తేడాలు రావడంతో ఆదోనిలోని జనసేన నాయకులు సైలెంట్ గా ఉండిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+