తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వరు, ఏం చేస్తారు ?, టీటీడీ మాజీ చైర్మన్
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్యమతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందే డిక్లరేషన్ ఇవ్వాలని 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. అయితే గతంలో సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే.
శుక్రవారం వైసీపీ అధినేత జగన్ తిరుమల చేరుకోనున్నారు. జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ముందుగా డిక్లరేషన్ పై సంతకం చేయాలని హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ అధినేత జగన్ డిక్లరేషన్ పై సంతకం చేయరని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తేల్చిచెప్పడం కలకలం రేపుతుంది.

శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ పై సంతకం చేయాలా ? అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి అనిత క్రిస్టియన్ అని, ఆమె స్వయంగా తాను క్రిస్టియన్ అని చెప్పారని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. అన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అని కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి అనిత ఏమైనా డిక్లరేషన్ పై సంతకం చేశారా అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులను ప్రశ్నించారు. మీరు అధికారంలో ఉంటే డిక్లరేషన్ పై సంతకం చేయకుండానే శ్రీవారిని దర్శించుకుంటారని, ఇప్పుడు మేము అధికారంలో లేము కాబట్టే జగన్ ను డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

హోం మంత్రి అనిత డిక్లరేషన్ పై సంతకం చేయనప్పుడు జగన్ ఎందుకు డిక్లరేషన్ పై సంతకం చేయాలి అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ ఎట్టిపరిస్థితుల్లో డిక్లరేషన్ పై సంతకం చేయరని, శ్రీవారి దర్శించుకుంటారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎవరైనా జగన్ ను తిరుమలలో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారు పక్కా హిందూ ద్రోహులని, వాళ్లకు ప్రజల సరైన సమాధానం చెబుతారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని ఇంతవరకు టీటీడీ ఈవో శ్యామల రావు ఒక్క మాట కూడా చెప్పలేదని, జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మాత్రమే డిమాండ్ చేస్తున్నారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ అధికారులు డిక్లరేషన్ ఇవ్వాలని అడగకపోయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోని నాయకులు మాత్రం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని పదే పదే డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మొత్తం మీద జగన్ డిక్లరేషన్ ఇవ్వరని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంలో టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని హిందూ సంఘాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications