Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కల్తీ నెయ్యి కేసు విచారణ వేళ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం..!!

తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన సిట్ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విచారణ చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి సుబ్బారెడ్డి కీలక అంశాలను వెల్లడించారు. 2019 నుంచి 2014 వరకు మాత్రమే నెయ్యిపై ఎందుకు విచారణ చేస్తున్నారని నిలదీశారు. అంతకుముందు కూడా విచారణ చేయాలని డిమాండ్ చేసారు. లడ్డూ ఆరోపణల పై పాలీ గ్రాఫ్ పరీక్షకు సిద్దంగా ఉన్నట్లు సుబ్బారెడ్డి ప్రకటించారు.

టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన పైన వస్తున్న కల్తీ నెయ్యి ఆరోపణల పై ఘాటుగా స్పందించారు. కీలక అంశాలను వెల్లడించారు. టీటీడీ ఆస్తులపై తాము శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. తనను సిట్ విచారణ చేస్తే కూడా ఇవే అంశాలు చెప్పానని వెల్లడించారు. 2019 నుంచి 2014 వరకు మాత్రమే నెయ్యిపై ఎందుకు విచారణ చేస్తున్నారని నిలదీశారు. అంతకుముందు కూడా విచారణ చేయాలనన్నారు. రాజకీయాలకు ఆలయాలను వాడుకుంటు న్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. 30 సార్లు తాను అయ్యప్ప మాల వేసుకున్ నానని గుర్తుచేశారు. తనపై తప్పుడు నిందలు వేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చారని విమర్శించారు.

former-ttd-chairman-yv-subba-reddy-reacts-on-adulterated-ghee-allegations-details-here

లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడంతో సుప్రీంకోర్టులో కేసు వేశానని గుర్తుచేశారు. తాను తప్పు చేస్తే ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రశ్నించారు. నెయ్యి ట్యాంకర్లు పరిశీలించిన తర్వాతే లడ్డూ తయారీకి నెయ్యిని వినియోగించిన విషయాన్ని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ల్యాబ్ టెస్టులు జరిగినప్పుడు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఎలా కలిసిందని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 మధ్య కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ జరిగిందని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. సిట్ దర్యాప్తు జరుగుతుంటే ..కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ జరిగిందని మీడియాలో కథనాలు దురదృష్టకరమని పేర్కొన్నారు. కాగా, కిలో నెయ్యి రూ.326లకు కొనుగోలు చేశాం. తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో కల్తీ నెయ్యి విని యోగం జరిగిందన్న ప్రచారం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోళ్లు, కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు సమగ్రంగా జరగాలని డిమాండ్ చేసారు.

టీటీడీ ద్వారా లాభ పడాలని తనకు, తన కుటుంబానికి లేదన్నారు. శ్రీనివాస సేతు నిర్మాణంలో రూ.50 నుంచి 70 కోట్ల వరకు నిర్మాణ వ్యయం తగ్గించామని గుర్తు చేసారు. శ్రీవారి ఆదాయాన్ని కాపాడిన తమ పై నిందలు వేస్తున్నారన్నారు. L1, L2 దర్శనాలు రద్దు చేశామని.. పారదర్శకంగా ఉండేందుకు శ్రీవాణి దర్శనం తెచ్చామని వివరించారు. పద్మావతి హృదయాలయం ఆస్పత్రి స్థాపించామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. పరకామణిలో దొంగతనం జరిగిందని.. సీఐడీ విచారణకు రమ్మని చెప్పారని... పరకామణి అంశంలో రేపు (శుక్రవారం) విజయవాడలో సీఐడీ విచారణకు హాజరవుతానని వెల్లడించారు. తన కు అప్పన్న గతంలో మాత్రమేనని... ఆ తర్వాత ఆయన తనతో లేరన్నారు. టీటీడీ వ్యవహారంలో అప్పన్నకు సంబంధం లేదని చెప్పారు. అదే అంశాన్ని సిట్‌కు చెప్పినట్లు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+