వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశోక్ గజపతి రాజు కు అవమానం- ఆందోళన : శిలాఫలకం తోసివేత : రామతీర్దంలో ఉద్రిక్తత..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రామతీర్దం వేదికగా మరోసారి రాజకీయ రచ్చ చోటు చేసుకుంది. కొద్ది నెలల క్రితం రామతీర్దం బోడికొండపైన విగ్రహాల ధ్వంసం ఉద్రిక్తతలకు దారి తీసింది. రాజకీయంగా ప్రభుత్వం పైన ఆరోపణలకు వేదిక అయింది. ఆ తరువాత ప్రభుత్వం అక్కడ కొత్తగా రామాలయం శంకుస్థాపనకు నిర్ణయించింది. ఇక, ఈ రోజు రామాలయ శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు. ఆ సమయంలో ప్రోటోకాల్ రగడ మొదలైంది. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు తనకు అవమానం జ‌రిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

తనను అవమానించారంటూ..

తనను అవమానించారంటూ..


అశోక్ గజపతిరాజును కొబ్బరి కాయ కూడా మంత్రి వెల్లంపల్లి కొట్టనివ్వకుండా అడ్డుకున్నారంటూ అశోక్ గజపతి ఆందోళనకు దిగారు. శంకుస్థాపన శిలాఫలకం పైన ఆయన పేరు చేర్చకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ ధర్మకర్త అయిన తనకు సమాచారం లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. శిలా ఫలకం బోర్డు ను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో..తన అనుచరలతో కలిసి బైఠాయించారు. ఘటన జరిగి ఏడాది అవుతున్న ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని అశోక్ గజపతి ఆరోపించారు.

విరాళం ఇస్తే తిప్పి పంపారు

విరాళం ఇస్తే తిప్పి పంపారు

ఏడాదిలో గుడి కట్టి తీరుతం అని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగక పోవడం దారుణమ‌ని ఫైర్ అయ్యారు. ఆధారాలును తారుమారు చేయడానికి ఆలస్యం చేసారని.. ఆలయం ధర్మ కర్త కు కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఆగ్ర‌హం వ్యక్తం చేసారు. గుడికి విరాళం ఇస్తే తిరిగి ఇచ్చేసారని... భక్తులు విరాళాలు తిరస్కరించడానికి అధికారం ఎవరు ఇచ్చార‌ని నిలదీసారు. ఈ ప్రభుత్వం హయాంలో వందలాది ఆలయాలు ధ్వంసం జరిగాయని ఫైర్ అయ్యారు. ఈ సమయంలోనే గజపతిని ఉన్నపళంగా పక్కకు నెట్టుకుంటూ వెళ్లారు ఆక్కడి కొందరు వ్యక్తులు.

బైఠాయింపు - నిరసనలతో

బైఠాయింపు - నిరసనలతో


అశోక్‌గజపతి లేవనెత్తిన ప్రోటోకాల్ టాపిక్‌తో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తత మధ్యే రామతీర్థంలో ఆలయానికి శంకుస్థాపన పూర్తిచేశారు. గతేడాది డిసెంబర్‌ 28న రాముని విగ్రహం ధ్వంసం తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ట, ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ప్రధాన ఆలయం ప్రాంగణంలో నూతన విగ్రహ ప్రతిష్ట జరిపి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం మూడు కోట్ల రూపాయాలతో ఈ ఆలయం నిర్మిస్తోంది. ఆరు నెలల్లో నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలను సిద్దం చేసారు. ఆలయంతో పాటు ధ్వజస్తంభం, వంటశాల, మెట్లమార్గం ఆధునికీకరణ, కోనేరును అభివృద్ధి చేయనున్నారు.


English summary
Former Union Minister Ashok Gajapati raju faced an insult in Ramatheertham..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X