జగన్ లా కేంద్రం కూడా ఆలోచిస్తే- మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కామెంట్స్..!

విజయనగరం : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం భాష గురించి మాట్లాడటం గమ్మత్తుగా ఉందని అశోక్ వ్యాఖ్యానించారు.
సరైన భాషను ఉపయోగించాలని వైసీపీ వాళ్ళే చెప్తున్నారని, కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మీరే(పత్రికలు) రాస్తున్నారని అశోక్ తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో సర్పంచ్ లకు విలువ లేకుండా పోయిందని అశోక్ మండిపడ్డారు. వికేంద్రీకరణ అంటే ఏంటి. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఏం చేస్తున్నారని అశోక్ ప్రశ్నించారు. రాజధానిని మూడు ముక్కలు చేసి వికేంద్రీకరణ అని అంటున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే లాజిక్ లో వెళ్లి కేంద్ర రాజధానిని కూడా వేరే వేరే ప్రదేశాల్లో పెడితే ఎలా ఉంటుందని అశోక్ ప్రశ్నించారు. ఒక రాజధానిగా ఉన్నా అధికారులు దొరకడం లేదని,
మూడు రాజధానులు చేస్తే ఎక్కడికి వెళ్ళాలన్నారు.

 former union minister ashok gajapati raju interesting comments on ysrcps three capitals

మరోవైపు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టుకు మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరమని అశోక్ గజపతి రాజు తెలిపారు. ఇప్పటికే గత టీడీపీ ప్రభుత్వంలో భూసేకరణ చేసి శంకుస్థాపన కూడా చేశామని గుర్తుచేశారు.
భాష దరిద్రమా...భావ దరిద్రమా అనేది వైసీపీ ఆలోచన చేయాలని ఆ పార్టీ నేతల్ని ఉద్దేశించి అశోక్ సూచించారు.
తమ జిల్లా పర్యటనకు చంద్రబాబు రావడం ఆనందంగా ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిల్లాలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని చేపట్టారు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దని వైసీపీ నేతల్నిఉద్దేశించి అశోక్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+