రిజర్వేషన్ల రద్దుకు ముహుర్తం ఖరారు ! ప్లాన్ ఇలా- పక్కా సమాచారమన్న చింతా మోహన్..!

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తే రిజర్వేషన్ల రద్దు ఖాయమంటూ ఇండియా కూటమి ప్రచారం చేసిన ప్రచారం నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ ముహుర్తం ఖరారు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఒత్తిడితో గత వారం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు.

దేశంలో 2028-2029 మధ్య రిజర్వేషన్లు రద్దవుతాయని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ వెల్లడించారు. సుప్రీం కోర్టు ద్వారా తీర్పు రాబోతోందని తనకు పక్కా సమాచారం అందిందన్నారు. బీజేపీ-ఆరెస్సెస్ ఈ మేరకు కుట్ర పన్నుతున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ, మైనార్టీల వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. గుజరాత్ నుంచి వచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూల వాదనలు చేశారని గుర్తుచేశారు.

former union minister chinta mohan predicts scrapping reservations between 2028-2029

కోర్టులన్నా, న్యాయమూర్తులంటే తనకు చాలా గౌరవం ఉందని, వాళ్లకి తలవంచి గౌరవిస్తానన్నారు. కానీ భారతదేశ అఖండతను, సమగ్రతను, సమైక్యతను దెబ్బతీసేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారత దేశ పౌరుడిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ పరిణామాలు, సుప్రీంకోర్టు తీర్పు చూసాక భారతదేశ అఖండత దెబ్బతింటుందేమోననే ఆందోళన అందరిలో ఉందన్నారు. రిజర్వేషన్లకు ప్రధాని గండి పెట్టారని, బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్ లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని ఆయన హెచ్చరించారు.

మనదేశంలో క్లాస్ కంటే క్యాస్ట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉందని, ఈ విషయాన్ని మహాత్మా గాంధీ గుర్తించారన్నారు. దక్షిణాఫ్రికా నుంచి బెజవాడకు వచ్చిన గాంధీ చక్రయ్యను కలిశాడని, అన్ని విషయాలు తెలుసుకుని ఆయన్ని కాంగ్రెస్లోకి తీసుకున్నాడని గుర్తుచేశారు. దేశ ప్రధమ రాష్ట్రపతిగా చక్రయ్యను చేయాలని గాంధీ కోరుకున్నారని, కానీ బ్రెయిన్ ట్యూమర్ తో చక్రయ్య చనిపోయాడన్నారు. గాంధీ గారు హరిజనోద్ధరణ గురించి మాట్లాడారేకానీ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడలేదన్నారు. కమ్యూనిస్టు సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.

గాంధీ ఆలోచన, నెహ్రూ స్ఫూర్తి, అంబేద్కర్ తెలివితేటలతో రిజర్వేషన్లు వచ్చాయని చింతా మోహన్ తెలిపారు. పోలవరానికి రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, తాను ఎంత ఖర్చు చేశారో ఆగస్ట్ 15వ తేదీ ప్రసంగంలో చంద్రబాబు చెప్పాలన్నారు. చంద్రబాబు పోలవరం లెక్కలు చెప్పకపోతే, నువ్వు కూడా బల్ల కింద వేలు పెట్టినట్లుగా ప్రజలు అనుకోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో ఒక కుటుంబం పదేళ్లు అధికారాల్లో ఉండి వేలకోట్ల రూపాయలు సంపాదించారని, ఆ కుటుంబం బిజెపిలో చేరిపోతుందని అంటున్నారన్నారు.

ఆంధ్రప్రదేశ్లో పదేళ్లు అధికారాన్ని అనుభవించిన ఒక కుటుంబం వేల కోట్లు సంపాదించారన్నారు. ఆ కుటుంబానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి తన సెక్యూరిటీ కోసం 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడన్నారు. నీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఆ డబ్బులు పెట్టి, సెక్యూరిటీ పెట్టుకోవచ్చు కదా అని అడిగారు. మాకు లేదే సెక్యూరిటీ! మేము తిరగడం లేదా? నీకెందుకయ్యా అంత సెక్యూరిటీ అని అడిగారు. నిన్న అమరావతి వెళ్లి పంట పొలాలను చూశానని, చంద్రబాబు నాయుడు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని అంటున్నారని, దాని గురించి రెండేళ్ల తర్వాత మాట్లాడతానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+