వైసీపీకి షాక్..జైలు బాట పట్టిన మరో కీలక నేత
వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి.గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మరోవైపు కీలక వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైలుకు పంపించి ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు రోజుల క్రితం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన మరువక ముందే మరో వైసీపీ కీలక నేత జైలుకు వెళ్లడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ మరోసారి జైలుకు వెళ్లారు.ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగం సురేష్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌ని అరెస్టు చేశాక ఆయనకి బెయిల్ వచ్చింది. వెంటనే దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‌ను మరోసారి అరెస్ట్ చేశారు.

ఈ కేసులో బెయిల్ కోసం నందిగం సురేశ్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.సుదీర్ఘ కాలం జైల్లో ఉన్న నందిగం సురేష్‌కు ఎట్టకేలకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.దాదాపు ఐదు నెలల తర్వాత నందిగం సురేష్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. తాజాగా ఆయన మరో కేసులో జైలుకు వెళ్లడం జరిగింది. అమరావతికి చెందిన మహిళ నందిగం సురేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఈ కేసులో అరెస్ట్ తప్పదని భావించిన నందిగం సురేశ్ ముందస్తుగానే సత్తెనపల్లిలో కోర్టులో లొంగిపోయారు. అయితే బెయిల్ వస్తుందనే ఆశతో కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యాయమూర్తి అనూహ్యంగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు.దీంతో నందిగం సురేశ్ కేవలం 17 రోజులు మాత్రమే బయట ఉన్నట్టు అయింది.












Click it and Unblock the Notifications