తుని ఘటనలో నలుగురికి బెయిల్, ఒకరికి పోలీసు కస్టడీ
రాజమహేంద్రవరం: కాపు గర్జన సమయంలో చోటు చేసుకున్న తుని విధ్వంసం ఘటనలో నలుగురికి బెయిల్ లభించింది. శుక్రవారం నాడు పిఠాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు పదమూడు మందిలో నలుగురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
బెయిల్ వచ్చిన వారిలో కూరకుల పుల్లయ్య, చక్కపల్లి సత్తిపాబు, లగుడు శ్రీనివాస్, పల్ల శ్రీహరి బాబులు ఉన్నారు. కోర్టు అనుమతి లేకుండా నిందితులు ఎక్కడకూ వెళ్లవద్దని, స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రతి రోజు సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది.

ఒకరికి మూడు రోజుల కస్టడీ
తుని ఘటనలో అరెస్టైన నలుగురిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం లగుడు శ్రీనివాస్‌ను మాత్రమే మూడు రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతించింది. మిగతా ముగ్గురిపై పిటిషన్లు తిరస్కరించింది.
నిలకడగా ముద్రగడ ఆరోగ్యం
గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. రాత్రి వైద్యానికి సహకరించారని, సెలైన్లు ఎక్కించామని తెలిపారు. మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగటంపై కుటుంబ సభ్యులకు వివరించామని వెద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications