నేను విన్నాను -నేను ఉన్నాను : జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు - సీఎం పీఠానికి తొలి అడుగు అక్కడే..!!

వైఎస్ జగన్. 2019 ఎన్నికల్లో అనూహ్య విజయం. 151 అసెంబ్లీ సీట్లు..22 లోక్ సభ సీట్లు సాధించి చరిత్ర క్రియేట్ చేసిన జగన్ కు ఆ అపూర్వ విజయం దక్కటం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. అందులో ప్రధానంగా అధికారానికి దగ్గర చేసింది ఆయన పాదయాత్ర. తన తండ్రి సమాధి దగ్గర సరిగ్గా నాలుగేళ్ల క్రితం వేసిన తొలి అడుగు అధికార పీఠం పైన కూర్చోబెట్టే వరకూ సాగింది. ఇడుపులపాయలో వైఎస్సార్‌ సమాధివద్ద 2017 నవంబర్‌ 6న పాదయాత్ర ప్రారంభమైంది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు.

3,648 కిలో మీటర్లు సుదీర్ఘ పాదయాత్ర

3,648 కిలో మీటర్లు సుదీర్ఘ పాదయాత్ర

341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర కొనసాగించారు. ఆ సమయంలోనే నేను విన్నాను..నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. పాదయాత్ర సమయంలోనూ..ఆ తరువాత అభ్యర్ధుల ఎంపిక..ఎన్నికల ప్రచారంలోనూ ప్రశాంత్ కిషోర్ తో పాటుగా ఆయన టీం జగన్ కు తోడ్పాటు అందించింది. క్షేత్ర స్థాయి అంశాలపైన సర్వేలు చేసి నివేదికలు అందించారు.

పాదయాత్ర హామీలే ఎన్నికల మేనిఫెస్టోగా

పాదయాత్ర హామీలే ఎన్నికల మేనిఫెస్టోగా

ఆ పాదయాత్ర సమయంలో తాను విన్న ప్రజల సమస్యల పరిష్కారమే మేనిఫెస్టోగా మారింది. జగన్ నిర్ణయించిన సంక్షేమ పాలనకు అక్కడే పునాదులు పడ్డాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీలే..ఎన్నికల వాగ్దానాలుగా మార్చారు. వాటిని మేనిఫెస్టోలో చేర్చి అదే తమకు దిక్సూచిగా పేర్కొన్నారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం..ఇలాంటి కార్యక్రమాలు పాదయాత్ర సమయంలో రూపొందించనవే. ప్రతీ గ్రామంలో సచివాలయం.. ప్రతీ వార్డులో సచివాలయం అందుబాటులోకి తెచ్చారు.

నవరత్నాలకు పునాదులే ఆ అడుగులు

నవరత్నాలకు పునాదులే ఆ అడుగులు

రాష్ట్ర చరిత్రలో తన తండ్రి వైఎస్సార్ చేసిన పాదయాత్ర తరువాత జగన్ నిర్వహించిన పాదయాత్ర సైలెంట్ రాజకీయ విప్లవానికి కారణమైంది. అందరి అంచనాలు..అధికార టీడీపీ ధీమాను తలకిందులు చేస్తూ అధికారం సాధించి పెట్టంది ఈ పాదయాత్రే. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రజాసంకల్పయాత్ర రాజకీయంగా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర చరిత్రలోనే చరిత్రాత్మక విజయాన్ని వైఎస్‌ జగన్‌ సామేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన జగన్‌ అందులో పేర్కొన్న ‘నవరత్నాలు' అమలుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు.

విశాఖ విమానాశ్రంలో కోడి కత్తితో దాడి

విశాఖ విమానాశ్రంలో కోడి కత్తితో దాడి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్నీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అక్టోబరు 25వ తేదీన జిల్లాలో 294వ రోజు యాత్ర పూర్తి చేసుకున్నజగన్, హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడి విఐపీ లాంజ్‌లో ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. దీంతో ప్రజా సంకల్పయాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. 17 రోజుల విరామం తర్వాత నవంబరు 12వ తేదీన యాత్ర తిరిగి మొదలైంది. పాదయాత్ర సమయంలోనే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అంచనా వేసారు.

Recommended Video

    ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
    నాటీ హామీలే నేడు నేతలకు పదవులుగా

    నాటీ హామీలే నేడు నేతలకు పదవులుగా

    పాదయాత్ర సమయంలో తనకు వైద్యుడిగా సేవలిందించిన డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఎంపీని చేసారు. పాదయాత్రలోనే తన ఎన్నికల అభ్యర్దులను పలువురిని ప్రకటించారు. టిక్కెట్లు ఇవ్వలేని వారికి వారి నియోజకవర్గాల్లోనే ప్రజల సమక్షంలోనే భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. తాను సీఎం అయిన తరువాత ఎంపిక చేసిన కేబినెట్ లో పక్కా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించారు. ఇక, అధికారంలోకి వచ్చే రెండున్నారేళ్లు పూర్తయింది.

    నాలుగేళ్ల పాదయాత్ర గుర్తుగా సెలబ్రేషన్స్

    నాలుగేళ్ల పాదయాత్ర గుర్తుగా సెలబ్రేషన్స్

    సంక్షేమం పేరుతో చెప్పినవి అమలు చేస్తున్నా..రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ముందుకు సాగటం లేదనేది జగన్ పాలన పైన ప్రధాన విమర్శ. ఇక, రాష్ట్ర అర్దిక పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. అయినా.. ఇంకా రెండున్నారేళ్ల సమయంలో అన్నీ చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటి నుంచే 2024 ఎన్నికలే టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. ఇక, జగన్ పాదయాత్ర నాలుగేళ్లు పూర్తి అవుతున్న సమయంలో వైసీపీ శ్రేణులు దీనిని సెలబ్రేట్ చేసుకొనేందుకు సిద్దమయ్యారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+