Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రాలో ఆఒక్కటి వర్కౌట్ అయితే వైసీపీ ప్రభుత్వం ఇంటికే, రెండు రాష్ట్రాల్లో ఇదే జరిగింది !!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్బంగా ప్రజల మనుసు గెలుచుకుని ఓట్ల రాబ్టుకోవడానికి ఇప్పటికే వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పుడు మంగళవారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేశారు. కూటమి మ్యానిఫెస్టోలోని ఒక్క పథకం క్లిక్ అయితే వైసీపీకి చుక్కలు కనపడటం గ్యారెంటీ అని స్పష్టంగా వెలుగు చూస్తోంది. ఇదే ఉచిత పథకం ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ప్రభుత్వాలను ఇంటికి పంపించేశాయి.

గతంలో కర్ణాటకలో బీజేపీలో అధికారంలో ఉండేది. తరువాత కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీల పేరుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. అందులో ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కూడా ఒక్కటి. ఏ రోజు అయితే మహిళకు ఉచిత ప్రయాణం అని కాంగ్రెస్ ప్రకటించిందో ఆరోజే కర్ణాటకలో బీజేపీకి సినిమా కనపడింది. చివరికి కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు కళ్లు మూసుకుని కాంగ్రెస్ సింబల్ మీద ఓట్లు గుద్దేశారు.

Free travel scheme for women in RTC buses will be a plus point in Andhra Pradesh elections

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్లలో బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారని తెలిసింది. ఇలా కర్ణాటకలో ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం బాగా వర్కౌట్ అయ్యింది. తరువాత తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం బాగానే వర్కౌట్ అయ్యింది. అంతకాలం తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పింపించిన కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది.

కర్ణాటక, తెలంగాణలో మహిళా ఓటర్లను ఉచిత ఆర్ టీసీ బస్సు ప్రయాణం బాగా ఆకట్టుకుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, రాష్ట్రంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆర్ టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దేశారు. ఇక తమిళనాడులో కూడా మహిళలకు ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఊహించని ఫలితాలు ఇచ్చింది. ఇలా మహిళలను టార్గెట్ చేసి ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రకటించారు.

Free travel scheme for women in RTC buses will be a plus point in Andhra Pradesh elections

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని టీడీపీ ప్రకటించింది. కూటమి మ్యానిఫెస్టోలో కూడా ఈ పథకానికి సంబంధించి వివరాలు ఉన్నాయి. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి కూటమిలోని ఆర్ టీసీ బస్సుల ఉచిత ప్రయాణం మహిళల్లోకి వెలితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీకి సినిమా కనపడటం గ్యారెంటీ అని నిపుణులు అంటున్నారు.

ఇదే సమయంలో ప్రతి మహిళకు రూ 1,500 ఇస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మ్యానిఫెస్టోలో స్పష్టం చేశారు. మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్న వైసీపీకి ఈ రెండు విషయాలు ఏకుమేకై కర్చువోడం గ్యారెంటీ అంటున్నారు. ప్రతిఇంటికి సంవత్సరానికి ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ మూడు పథకాలను కూటమి అభ్యర్థులు ప్రజల్లోకి బలంగా తీసుకెళితే వీళ్లదే విజయం గ్యారెంటీ అని అంటున్నారు. అయితే కూటమి మ్యానిఫెస్టో ప్రకటనపై వైసీపీ నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+