మరో ఘటన: యువతిపై సైకో సిరంజి ఇంజక్షన్ దాడి
ఏలూరు: పశ్చిమగోదావరి పెరవలిలో యువతిపై సైకో ఇంజక్షన్ దాడి చేశాడు. పెరవలి గ్రామంలో ఓయువతి మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా సూదితో గుచ్చి సైకో పరారయ్యాడు. ఎస్పీ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే దాడి చేయడం గమనార్హం.
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాల దగ్గర సైకో అనే అనుమానంతో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావవరి బొబ్బర్లంకలో మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడి నుంచి బైక్, సూది స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం పీఎస్‌లో అతడిని పోలీసులు విచారిస్తున్నారు. యువకుడి స్వస్థలం కడియం మండలం బుర్రెలంక గ్రామంగా తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఈ నెల 26వ తేదీ తర్వాత జరిగిన ఇంజక్షన్ దాడులన్నాీ అబద్ధపు కేసులని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. పొడిచిన ఇంజక్షన్లలో ఏ విధమైన మత్తు పదార్తం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
గ్రామాల్లో తాము రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకుంటామని, ఇప్పటి వరకు సూది సైకో దాడులకు సంబంధించి 11 కేసులు నమోదుయ్యాయని ఆయన చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications