శ్వేతసౌధానికి ప్రభుత్వ బడి విద్యార్ధులు - యూఎన్ఓ సదస్సుకు హాజరు..!!

ప్రభుత్వ బడి విద్యార్ధులకు అరదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సందర్శించేందుకు ఆహ్వానం అందింది. మన ప్రభుత్వ బడి విద్యార్ధులు తొలిసారి అమెరికా అధ్యక్ష భవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అదే సమయంలో కొలంబియా వర్సిటీ సదస్సులో ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులతో కలిసి ప్రసంగించే అవకాశం దక్కించుకున్నారు. ప్రపంచ బ్యాంకులోనూ ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రసంగించనున్నారు.

అరుదైన అవకాశం : ఏపీలో ప్రభుత్వ బడుల్లో చదివే పది మంది విద్యార్ధులు అమెరికాలో పర్యటించే అరుదైన అవకాశం దక్కింది. తొలిసారి విద్యార్దులకు అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ ను సందర్శించే ఛాన్స్ లభించింది. అమెరికా ప్రభుత్వంలోని బ్యూరో ఆఫ్సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా అఫైర్స్ విభాగం ఈ అవకాశం కల్పించింది.

jaganandgovernmentschoolstudent1

పది మంది ప్రభుత్వ బడి విద్యార్దులు సెప్టెంబర్ 17 నుంచి 27 వరకు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే స్థిర అభివృద్ధి అనే అంశం పై జరిగే ప్రత్యేక సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల్లో విద్యా విధానం,కల్పించిన అవకాశాలపై చర్చించ నున్నారు. ఇందులో అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల విద్యార్దులు పాల్గొంటున్నారు.

యూఎన్ ఓలో ప్రసంగం : రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు..మనబడి నాడు -నేడు పథకంతో పాటుగా మారిన పాఠశాలల పరిస్థితులు..వసతులు...ఇంగ్లీషు బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్ ఫలితంగా వచ్చిన మార్పులపై మన విద్యార్ధులు సదస్సులో ప్రసంగించనున్నారు. ఆ తరువాత కొలంబియా యానివర్సిటీలో జరిగే సదస్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రసంగించే అవకాశాన్ని ఆ వర్సిటీలోని సెంటర్ ఫర్ సస్టయినబుల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ రాధిగా అయ్యంగార్ కల్పించారు. ఈ మేరకు యూఎన్ఓ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ అధికారికంగా వెల్లడించారు.

apgovernmentschoolstudents

ప్రపంచ బ్యాంకులోనూ : దీంతో పాటుగా వాషింగ్టన్ లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో బ్యాంకు ఉన్నతాధికారులతో కూడా మన విద్యార్దులు మాట్లాడే అవకాశం దక్కనుంది. ఇది ఒక అద్బుత అవకాశంగా విద్యా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. త్వరలోనే పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్..కమిషనర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో అమెరికా సందర్శించే విద్యార్ధులను ఎంపిక చేయనున్నారు. బోధనా పరంగా ప్రభుత్వ ఇస్తున్న ప్రాధాన్యత..ప్రభుత్వ నిర్ణయాల ఫలితాలను విద్యార్దులే స్వయంగా ప్రపంచ వేదిక పైన తెలియచేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+